విరహతాపం 


ఆ చూపు

బాణము విసిరుతున్నట్లున్నది

ఆ రూపు

వెలుగులు చిమ్ముతున్నట్లున్నది


ఆ పిలుపు

తేనెను చల్లుతున్నట్లున్నది

ఆ నవ్వు 

వలను విసురుతున్నట్లున్నది


ఆ సైగ

చెంతకు రమ్మన్నట్లున్నది

ఆ పైట

గాలికి లేస్తున్నట్లున్నది 


ఆ చేతులు

కలుపమని  కోరుతున్నట్లున్నది

ఆ కనులు

ఆదుర్దాగా ఎదురుచూస్తున్నట్లున్నది


ఆ మోము

నిండు జాబిలిలాగున్నది

ఆ వెలుగు

వెన్నెల చల్లుతున్నట్లున్నది


ఆ మది

ప్రేమలో పడినట్లున్నది

ఆ హృది

తోడుకై తపిస్తున్నట్లున్నది


ఆ దేహము

దేనికో ఎదురుచూస్తున్నట్లున్నది

ఆ బిడియము

ఏలనో అడ్డుపడుతున్నట్లున్నది


ఆ ఒళ్ళు

తాపానికి ఉడికిపోతున్నట్లున్నది

ఆ కాళ్ళు

కదులుటకు తడబడుతున్నట్లున్నది


ఆ స్థితి

అయోమయంగా ఉన్నట్లున్నది

ఆ గతి

వర్ణనాతీతంగా కనబడుతున్నది


ఆ ప్రేమ

త్వరలో పండేటట్లున్నది

ఆ కోర్కె

తప్పకుండా తీరేటట్లున్నది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog