ఓ భగవంతుడా!


భారం

దింపేస్తావా

భుజాలపైనుండి

శిరసుపైనుండి


బాధ్యత

తప్పిస్తావా

ఎత్తుకున్నవాటినుండి

తగులుకున్నవాటినుండి


భాగ్యం

చేకూరుస్తావా

బాగాబ్రతకటానికి

పరులసేవలుచేయటానికి


బాటను

చూపిస్తావా

పయనించటానికి

గమ్యంచేరటానికి


భ్రమలు

తొలగిస్తావా

తెరలుతొలగించి

నిజాలుచూపించి


బంగారం

అందిస్తావా

అలంకరించుకోవటానికి

అందాలనుచూపటానికి


భోగాలు

కలిపిస్తావా

అనుభవించటానికి

ఆనందించటానికి


బోనాలు

ఎత్తిస్తావా

అమ్మనుకొలవటానికి

సంస్కృతినిలపటానికి


భజనలు

చేయిస్తావా

భక్తినిచాటటానికి

ముక్తినిపొందటానికి


భావాలు

బయటపెట్టిస్తావా

బహుగొప్పగా

చాకచక్యంగా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog