మాటల మూటలు-ముచ్చట్లు


మాటలు

తడుతున్నాయి

ముద్దుగా

మురిపెంగా


మాటలు

తెలుపుతున్నాయి

మనుషులను

మనస్తత్వాలను


మాటలు

మెరిసిపోతున్నాయి

తళతళా

మెరుపుతీగలా


మాటలు

మురిపిస్తున్నాయి

సుమధురంలా

సుగంధంలా


మాటలు

మత్తెక్కిస్తున్నాయి

త్రాగిస్తూ

తూగిస్తూ


మాటలు

మంటలులేపుతున్నాయి

తన్నుతూ

తగలేస్తూ


మాటలు

మదులుదోస్తున్నాయి

నిలవాలని

గెలవాలని


మాటలు

ప్రసరిస్తున్నాయి

జోరుగా

హోరుగా


మాటలు

ప్రవహిస్తున్నాయి

వాగులాగా

వరదలాగా


మాటలు

ప్రేలుతున్నాయి

పెదవుల్లోనుండి

పేనాల్లోనుండి


మాటలు

వినిపిస్తున్నాయి

శ్రావ్యంగా

సున్నితంగా


మాటలు

కోటలుదాటుతున్నాయి

కోతలతో

కల్పనలతో


మాటలు

ఆకర్షిస్తున్నాయి

అందాలతో

ఆనందాలతో


మాటలు

అలరిస్తున్నాయి

అక్షరలక్షలతో

పదాలప్రాసలతో


మాటలు

ముచ్చట్లు

మురిపాలు

ముత్యాలు


మాటలు

భావాలు

భ్రాంతులు

కవనాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog