ఉత్సాహభరితంగా సాగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదీ 11వ అంతర్జాల సమావేశం

*****************************************************************


ఈ రోజు ఉదయం సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి సందర్భముగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక 11వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది.సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ కవి సాహితీవేత్త శ్రీ దాస్యం సేనాధిపతి గారు తెలుగు సాహిత్యానికి ప్రతాపరెడ్డి సేవలను అనన్యము, శ్లాఘనీయము అని అన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రతాపరెడ్డి  గారిని తప్పక స్మరించుకోవాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సహస్ర సినీ టీవి గీత రచయిత తెలుగు వారు ప్రతాపరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. 

సమన్వయకర్త గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ  తెలుగు  సాహిత్య సంస్కృతి చరిత్రలో ప్రతాపరెడ్డి గారి స్థానం అతి విశిష్టమైనదని అన్నారు.మొదట, నంది అవార్డు గ్రహీత, సినీ దర్శకుడు శ్రీ దీపక్ న్యాతి గారు తొలిపలుకలతో అందరికీ స్వాగతం పలికారు.


తర్వాత కవిసమ్మేళన సామ్రాట్ శ్రీమతి రాధాకుసుమ గారు కవిసమ్మేళనమును చిరుమందహాసంతో, చక్కని వ్యాఖ్యలతో, క్రమశిక్షణతో నిర్వహించారు. మొదట అరవ  రవీంద్ర బాబు 'క్రియాశీలక ఉద్యమకారుడు ' అనే శీర్షికతో సురవరం గురించి చక్కని కవిత చదివారు. పంతుల లలిత ' తెలంగాణా ' వైతాళికుడు ' అనే కవితను సురవరంపై వినిపించారు. అయ్యల సోమయాజుల ప్రసాద్ ప్రతాపరెడ్డి గురించి బహుముఖ ప్రఙ్ఞాచారి అనే చక్కని కవితను చదివారు.కట్టా శ్యామలాదేవి సాహితీప్రియుడు అంటూ మూడు పద్యాలు పాడి వినిపించారు. శోభ దేశ్ పాండె పండుగలు అనే కవితను శ్రావ్యంగా వినిపించారు. సుబ్బారావు క్రిష్టంసెట్టి వివాహ బంధం అనే కవితను బాగా చదివారు.కాదంబరి క్రిష్ణప్రసాద్ చెడు వినకు, చూడకు, చేయకు అంటూ మంచికవితను పఠించారు. వడ్లమూడి సంధ్య తెలుగుతల్లి ఋణం గిడుగు గారి గాధ అనే కవితను ఆలపించారు. గాడేపల్లి మల్లికార్జునుడు ఆచార్య దేవోభవ అనే కవితను చదివారు. కొళ్ళూరి యామిని కృషీవలుడు అనే కవితను చక్కగా చదివారు. గూండ్ల నారాయణ వ్యవసాయం అనే కైతను ఆలపించారు.  


సరోజినిదేవి పసర్ల 'సురవరం సువర్ణం సుందరం ' అని ప్రాసాత్మక కవితను చదివారు. వినోదరెడ్డి హలం పడతా అనే కవితను చదివారు. మహమ్మద్ రవూఫుద్దీన్ సురవరం మా వరం అనే మంచి కవితను చదివారు. పాటిబండ్ల కవిత భోగంతో భవనాలు,  భారంతో గల్లీ బ్రతుకులు అనే కవితను ఆలపించారు. పి. నాగేంద్రమ్మ తెలుగు భాషా దినోత్సవం అనే కవితను వినిపించారు.ధనమ్మారెడ్డి వృధ్యాప్యం అనే కవితను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. దీపక్ న్యాతి ఆధునీకరణ అనే దివిటీని వినిపించారు. మంత్రిప్రగడ మార్కండేయులు ప్రశాంత ప్రకృతి గర్భంలో అనే కయితను పఠించారు. అవుసలి ఆంజనేయులు వలయం అనే కవితను ఆలపించారు. దాడిగ నరేష్ కోరిక అనే కవితను చదివారు.బిటవరం శ్రీమన్నారాయణ మానవత్వమూర్తి సురవరం ప్రతాపరెడ్డి అనే కవితను చదివి అందరిని ఆకర్షించారు. డాక్టర్ రాధా కుసుమ శారదా అనే శ్రావ్యమైన పాటను పాడి సభికులను ఆకట్టుకున్నారు. సంతోష్ ఓ నా ప్రియబంధమా అనే కవితను ఆలపించారు. చివరగా సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ 'పాలమూరు ముద్దుబిడ్డ ప్రతాపరెడ్డి ' అంటూ హావ భావాలతో అనునయిస్తూ చిక్కని చక్కని కవితను పఠించి శ్రోతల మన్ననలను పొందారు.


ధరణీ సంస్థ వ్యవస్థాపకురాలు ధనమ్మరెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. బీటవరం శ్రీమన్నారాయణ సాంకేతిక సహకారం అందిస్తూ చాలా చక్కగా కార్యక్రమ నిర్వహణకు తోడ్పడినందుకు కవులు ధన్యవాదాలు తెలిపారు.


సభ మరియు కవిసమ్మేళనం ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగినందుకు పాల్గొన్న వారందరూ సంతోషం వ్యక్తపరిచారు.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog