నా కలం
అల్లమంటుంది
అక్షరాలు
ముత్యాలసరాల్లా
పలకమంటుంది
పదాలు
చక్కని చిలుకల్లా
కాయించమంటుంది
వెన్నెల
పున్నమి జాబిలిలా
ప్రసరించమంటుంది
కిరణాలు
ఉదయిస్తున్న సూర్యుడిలా
చిందించమంటుంది
నవ్వులు
మోములు వెలిగేలా
చల్లమంటుంది
సౌరభాలు
మరుమల్లె పువ్వుల్లా
కురిపించమంటుంది
కవితలు
వానజల్లుల్లా
అలరించమంటుంది
అంతరంగాలలోతులు
నీలిగగనంలా
దోచుకోమంటుంది
హృదులను
రంగుల హరివిల్లులా
నిలిచిపొమ్మంటుంది
చిరకాలము
చరిత్రలో అమరుడిలా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment