మానవనైజం


పగలంటే — ప్రియమే

రాత్రంటే — భయమే


లాభమొస్తే — సంతోషం

నష్టమొస్తే — విచారం


దేవుడంటే — నమస్కారం

దెయ్యమంటే — తృణీకారం


హీరోకయితే — అభిమానం

విలనయితే — విద్వేషం


అందమంటే — ఆనందం

అసహ్యమంటే — అయిష్టం


ఆదాయమొస్తే — సుఖం

వ్యయమైతే — దుఃఖం


ఆరోగ్యమంటే — భాగ్యం

అనారోగ్యమంటే — శోకం


తోడులభిస్తే — సంతసం

ఒంటరైతే — విలాపం


మంచికైతే — ఆహ్వానం

చెడుకైతే — తిరస్కారం


శుభమైతే — పొంగిపోవటం

అశుభమైతే — కృంగిపోవటం


జననం — పర్వదినం

మరణం — శోకదినం


మానవనైజం — చిత్రమే

జీవితపయనం — విచిత్రమే


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog