పూలకైపులు


గులాబీలు

గుబాళిస్తుంటే

మల్లెలు

మత్తెక్కిస్తున్నాయి


మందారాలు

మురిపిస్తుంటే

మొగలిరేకులు

ముచ్చటపరుస్తున్నాయి


బంతిపూలు

మదిదోస్తుంటే

చేమంతులు

చోద్యపరుస్తున్నాయి


సన్నజాజులు

సంబరపరుస్తుంటే

సంపంగెలు

స్వాగతిస్తున్నాయి


తామరలు

తలలుతడుతుంటే

కలువలు

కళ్ళనుకట్టేస్తున్నాయి


పువ్వులు

ప్రకాశిస్తుంటే

హృదులు

ఆస్వాదిస్తున్నాయి


పుష్పాలు

పలురంగులుచిమ్ముతుంటే

మదులు

మహదానందపడుతున్నాయి


సుమాలు

సుగంధాలుచల్లుతుంటే

సీతాకోకలు

చుట్టుముటుతున్నాయి


పూలకన్యలు

పిలుస్తుంటే

కవులకలాలు

కదులుతున్నాయి


పూలవర్షము

కురుస్తుంటే

కవితాజల్లులు

పారుతున్నాయి


పూలతోట

ఎంతహృద్యము?

పూలబాట

ఎంతసుందరము?


పూలదృశ్యము

ఎంతరమణీయము?

పూలకవితలు

ఎంతమధురము?


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog