ముందుకు వెళదామా…
అక్షరాలు పేర్చుదాం
ఆవిరిగా మార్చుదాం
ఆకాశానికి పంపుదాం
అంబుదముగా మార్చుదాం
చినుకులై కురుద్దాం
కాలువలై పారుదాం
తనువులు తడుపుదాం
మనసులు మురిపిద్దాం
పెదవులు విప్పుదాం
స్వరములు పలికిద్దాం
కోకిలలై పాడుదాం
హృదులు హరిద్దాం
చిత్రములు గీద్దాం
రంగులను పూద్దాం
పువ్వులై వికసిద్దాం
సువాసనలై వ్యాపిద్దాం
పున్నమిని వర్ణిద్దాం
జాబిలిని పొడిపిద్దాం
మేఘాలను కదిలిద్దాం
దోబూచులు ఆడిద్దాం
చుక్కలను పేర్చుదాం
తళతళలు చిమ్ముదాం
వెన్నెలను కురిపిద్దాం
వెలుగులు చల్లుదాం
కలమును పట్టుదాం
కాగితాలు నింపుదాం
ప్రాసలను కూర్చుదాం
లయను కొనసాగిద్దాం
కవితలను అల్లుదాం
తేనెలను అంటుదాం
సౌరభమును చిమ్ముదాం
సాహిత్యమును అలరిద్దాం
ఆలోచనల పందిరై
కలలతోట వనమవుదాం
సత్య స్వప్నయాత్రలో
జీవితగమ్యం అవుదాం
గుండెలు కొట్టుకునేంతవరకు
మనసులు పాడుకునేంతవరకు
కడదాక ఆనందయాత్ర సాగిద్దాం
కలసి అడుగులు ముందుకేద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment