కవివరా!
(వాక్య ప్రతాపాలు)
వాక్యంతో
మనసుద్వారాలు
తెరిపిస్తావా
వాక్యంతో
ఆలోచనలు
పారిస్తావా
వాక్యంతో
అమృతము
అందిస్తావా
వాక్యంతో
గళము
ఎత్తిస్తావా
వాక్యంతో
వీనులకువిందు
ఇస్తావా
వాక్యంతో
దేహాలు
అలంకరిస్తావా
వాక్యంతో
నవ్వులు
చిందిస్తావా
వాక్యంతో
తేనెచుక్కలు
చల్లిస్తావా
వాక్యంతో
తియ్యదనము
కలిగిస్తావా
వాక్యంతో
వెలుగులు
వెదజల్లుతావా
వాక్యంతో
సుందరదృశ్యాలు
చూపించుతావా
వాక్యంతో
హృదులను
హత్తుకుంటావా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment