🌸 పూలుపూచాయి 🌸


పొద్దుపొద్దునే పూలు పూచాయి,

పూలతల్లులు పరవశించారు.


తేనె నింపె పరమాత్ముడు,

రంగులు అద్దె దేవేరులు.


పుడమి పొంగిపొరిలె,

ప్రకృతి పులకరించి వెలిగె.


ప్రభాకరుడు కిరణాలు చల్లె,

పడతులు అంతయు సంతసించె.


పవనుడు పరిమళమై వీచె,

పరిసరాలు ప్రమోదమై పొంగె.


పిల్లలు నవ్వులు చిందె,

పెద్దలు స్వాగతాలు పలికె.


బాలికలు జడలు వేసి సిద్దమయ్యె,

భామలు అలంకరించుకొని వెలిగిపొయ్యె.


మొగ్గలు తలలూపి పాడె,

మదులు మురిసి నాట్యమాడె.


పూజారి పూలకు ప్రసన్నమయ్యె,

పరమేశ్వరార్చనలో మునిగిపొయ్యె.


అందమేమిటో అందరూ గ్రహించె,

ఆనందమెందుకో అందరినీ అనుగ్రహించె.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం ✍


Comments

Popular posts from this blog