జర జాగ్రత్త మానవా!
పుండుమీద కారం చల్లేవారున్నారు
పాలలో విషం కలిపేవారున్నారు
కళ్ళను పొడిచేవారున్నారు
నోర్లను మూసేవారున్నారు
నిప్పురవ్వలు painaచల్లేవారున్నారు
గుంటల్లోకి పడదోచేవారున్నారు
బాధలు పెట్టేవారున్నారు
బూతులు తిట్టేవారున్నారు
ఎక్కేవారిని క్రిందకు లాగేవారున్నారు
నడిచేవారిని ఆటంకపరచేవారున్నారు
కష్టాలు కలిగించేవారున్నారు
నష్టాలు మోపేవారున్నారు
ద్వేషాలు రగిల్చేవారున్నారు
మోసాలు చేసేవారున్నారు
బురద చల్లేవారున్నారు
నిందలు వేసేవారున్నారు
చేతులకు బేడీలు తొడిగేవారున్నారు
కాళ్ళకు సంకెళ్ళు వేసేవారున్నారు
హత్యలకు పాల్పడేవారున్నారు
శీలాలు దోచుకునేవారున్నారు
నరరూపరాక్షసులను మనించు
అసూయపరులను దూరంగాపెట్టు
మంచివారితో చేతులుకలుపు
ముంచేవారితో తెగతెంపులుచేసుకొమ్ము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment