రంగులలోకం


పూలు

పలురంగులతో ఆకర్షిస్తాయి

చెట్లు

పచ్చదనంతో అలరిస్తాయి


హరివిల్లు

సప్తవర్ణాలతో శోభిల్లుతుంది

గగనము

నీలిరంగుతో ముచ్చటకొలుపుతుంది


చిలుక

ఆకుపచ్చతో ఆకట్టుకుంటుంది

సీతాకోకచిలుక

విచిత్రరంగులతో వేడుకపరుస్తుంది


రవి

అరుణకాంతులతో ఉదయించిమేల్కొలుపుతాడు

చంద్రుడు

తెల్లనివెన్నెలతో మదులనువశపరచుకుంటాడు


బుగ్గలు

ఎర్రరంగుతో సిగ్గులుచూపుతాయి

నల్లబొట్లు

దిష్టితగలకుండా కాపాడుతాయి


కళ్ళు

నల్లకాటుకతో మిలమిలలాడుతాయి

జుట్టు

నల్లరంగుతో మెరిసిపోతాయి


చిత్రాలు

రంగులదిద్దులతో రమణీయమవుతాయి

లక్కబొమ్మలు

వర్ణపూతలతో రాజిల్లుతుంటాయి


కాషాయం

త్యాగాలను గుర్తుకుతెస్తుంది

సముద్రం

బులుగురంగును తలిపిస్తుంది


నలుపు

దిష్టితగలకుండా కాపాడుతుంది

గోరింట

కాళ్ళచేతులవ్రేళ్ళు ఎర్రగాపండిస్తుంది


రంగులు

కళ్ళను తెరిపిస్తాయి

హంగులు

మదులను మురిపిస్తాయి


కాగితాలు

తెల్లగుండి రాయమంటాయి

అక్షరాలు

నల్లగుండి చదవమంటాయి


కవులు

వన్నియలను చూపించుతారు

కవితలు

రంగులదృశ్యాలు కనపరుస్తాయి


వస్త్రాలకు

వన్నెప్రాణం

కనకానికి

మెరుగెముఖ్యం


రంగులప్రపంచం

రమణీయం

పువ్వులప్రపంచం

వీక్షణీయం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog