లక్ష్మీదేవిని పూజిద్దాం రారండి
శ్రావణమాసం
శుక్రవారమున
శ్రీలక్ష్మీదేవిని
సేవిద్దాం రారండి ||శ్రావణ||
ఆడవాళ్ళం
అందరంకలసి
వరలక్ష్మీదేవిని
పూజిద్దాం రారండి
వరలక్ష్మీదేవి
వ్రతమురోజున
అమ్మవారిని
ఆరాధిద్దాం రారండి ||శ్రావణ||
ముత్తైదువులకు
జాకెట్టుముక్కలుపెట్టి
పసుపుకుంకాలిచ్చి
గౌరవిద్దాం రారండి
అష్టలక్ష్ములను
అంతరంగానతలచి
ఇంటికిరమ్మని
మాతనుపిలుద్దాం రారండి ||శ్రావణ||
పిల్లాపెద్దలం
పూలుపండ్లుపట్టుకొని
అమ్మవారిగుడికి
త్వరగావెళ్దాం రారండి
భోగభాగ్యాలను
కొరవలేకుండా
ఇవ్వమని
జననినివేడుదాం రారండి ||శ్రావణ||
భర్తాపిల్లలను
సదాకాపాడమని
కరుణచూపమని
ప్రార్ధిద్దాం రారండి
చేతికి గాజులు
కాళ్ళకుమెట్టెలు
నిండునూరేళ్ళు
నిలుపమందాం రారండి ||శ్రావణ||
నుదుటబొట్టు
కొప్పునపూలు
మెడకుతాళి
కాపాడమందాం రారండి
మంత్రాలు చదివి
హారతులు ఇచ్చి
ప్రసాదాలు పంచి
తల్లినికొలుద్దాం రారండి ||శ్రావణ||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment