భావసృష్టి
ఖాళీ మనసును
రంగులతో నింపు
చిక్కగా కలుపు
చక్కగా చూపు
నింగిపైకి విసురు
నీలముగా మార్చు
అందాలదృశ్యము ఆవిష్కరించు
ఆనందాలను పంచిపెట్టు
దీపాలలో నింపు
అగ్గిపుల్లతో వెలిగించు
కాంతులు వెదజల్లు
చీకటిని తరుము
గాలిలోకి చిమ్ము
సుగంధాలు అంటించు
ఆఘ్రానించమని చెప్పు
ఆహ్లాదంలో ముంచు
కడలిలో కలుపు
బులుగును అద్దు
కెరటాలను ఎగిరించు
కుతూహలము కలిగించు
గ్లాసులలో నింపు
తీపిని జోడించు
గొంతులకు అందించు
గీతాలను కమ్మగాపాడించు
చెట్లమీద చల్లు
పూలకు తగిలించు
తేటులను పిలువు
తేనెను త్రాగించు
భావచిత్రాలు సృష్టించు
వైభవంగా ప్రదర్శించు
చైతన్యము రగిలించు
గుండెలలో నిద్రించు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment