మూడు గంటలూ ముచ్చటగా జరిగిన కాలిఫోర్నియా వీక్షణం 158వ అంతర్జాల సాహితీ సమావేశం

**************************************************************


నేడు 11-10-25వ తేదీ ఉద్యయం కాలిఫోర్నీయా వీక్షణం గవాక్షం నిర్వహించిన 158వ అంతర్జాల సమావేశం ఆద్యంతము ఉత్సాహభరితంగా సాగింది. మొడట వీక్షణం వ్యవస్థాపుకురాలు మరియు అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి గారు పాల్గొంటున్న సాహితీ ప్రియులకు, కవిమిత్రులకు స్వాగతం పలికారు. ముఖ్య అతిధి శ్రీ ఆచార్య ఫణీంద్ర గారిని వేదికకు పరిచయం చేసి. వారు సృష్టించిన ఏక వాక్య కవితా  ప్రక్రియ గురించి ప్రసంగించమని ఆహ్వానించారు.


వాక్యం రసాత్మకం కావ్యం అని గురువు గారు చెప్పిన తర్వాత, సంస్కృత వ్యాక్యాలు కొన్ని తెలుసుకున్నాక, ఏక వాక్య కవితలు వ్రాయటం మొదలుపెట్టానని, పెక్కు కవితలు వ్రాసి, పెక్కు పుస్తకాలు ప్రచురించానని చెప్పారు. అనేక ఏకవాక్య కవితలను వినిపించి, వీక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వారి ప్రసంగం చాలా రసవత్తరంగా ఉందని, గీతా మాధవి గారు, ప్రఖ్యాత కవులు ఘంటా మనోహరరెడ్డి గారు, సాధనాల వేంకటస్వామినాయుడు గారు ప్రశంసించారు. ఫణీంద్ర గారు పాటవం కల పద్యకవి అని, మధుర కంఠమున్న మాటకారి అని, తెలుగు భాషలో వెలుగు దెవ్వె అని పద్యం వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు.


పిమ్మట, వీక్షణం భారతదేశ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు మరియు కవిసమ్మేళన సామ్రాట్ డాక్టర్ రాధా కుసుమ గారు కవిసమ్మేళనం నిర్వహించారు.


మొదట డాక్టర్ గీతా మాధవి గారు అలతి అలతి పదాలతో చక్కని కవితను వినిపించి కవిసమ్మేళనానికి చక్కని ఆరంభం ఇచ్చారు. ప్రఖ్యాత కవి నాళేశ్వరం శంకరం గారు పాలకుర్తి సోమనాధుడు గురించి చెప్పి తొలి తెలుగు జీవనది అనే కవితను వినిపించారు. సాధనాల వేంకటస్వామినాయుడు గారు మహామేత మన నేత అని, అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు ఇరవైలో అరవై అనే కవితను, పద్యకవి కొండ్రెడ్డి నాగిరెడ్డి గారు లఘు కవితలను, గంటా మనోహరరెడ్డి గారు ఘంటారావం మినీ కవితలను, గాడేపల్లి మల్లికార్జునుడు గారు అక్షర సత్యం అనే కవితను, రామాయణం ప్రసాదరావు గారు మాట్లాడుకోవాలి మనం అనే కవితను, రామక్రిష్ణ చంద్రమౌళి గారు అనిసెట్టి ప్రభాకర్ స్మరించుకుంటూ మినీ కవితలను, డాక్టర్ కోదాటి అరుణ గారు కొన్ని లఘు కవితలు వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. బలుసాని వనజ గారి అమ్మా స్వతంత్ర భారతి అనే పాటను మధురంగా పాడారు. రాధా కుసుమ గారు గుడిమెట్లు అనే కవితను, ముఖ్య అతిధి ఆచార్య ఫణీంద్ర గారు శ్రావ్యంగా రెండు పద్యాలు పాడారు. బిటవరం శ్రీమన్నారాయణ గారు అసంజసం అనే కవితను, ఆనం ఆశ్రితారెడ్డి గారు ఇన్నాళ్ళు స్వాతంత్ర్యంలో సాధించిందేమిటి, డాక్టర్ బృందా గారు చక్కని పాటను, నెల్లూరు ఇందిర గారు నువ్వు వెళ్ళేదాకా తెలియదు నాన్నా అని, చిట్టాబత్తిన వీరరాఘవులు గారు స్పందన అనే మినికవితను, యువ కవయిత్రి జోరు పవిత్ర రూపాయలనైనా జరభద్రంగా చూచుకో అని, కందుకూరి శ్రీరాములు గారు కొన్ని మినీ కవితలు, పొదిలి శ్రావణి గారు ఓ మామూలు మనిషి అని, బుక్కపట్నం రమాదేవి గారు రమా వెన్నెలలు అనే మిని కవితలను, క్రిష్ణవేణి పరాంకుశం గారు మారాకునై అనే కవితను, తన్నీరు శశికళ గారు కొన్ని నానీలు, మేడిసెట్టి యోగేశ్వరరావు గారు నేను అనే మినీ కవితలను, భోగెల ఉమామహేశ్వరరావు గారు అక్షరమే ఆయుధం అనే కవితను, ఉప్పలపాటి వెంకట రత్నం గారు సప్తపదులు, చీదెళ్ళ సీతాలక్ష్మి గారు కొన్ని పద్యాలు, పరిమి వెంకట సత్యమూర్తి గారు అబ్దుల్ కలాం పై కవితను ఆలాపించి అందరినీ ఆకట్టుకున్నారు. చివరగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు పలకరింపులు అనే నానీలు చదివి సభికుల మదులను తట్టారు.


ముఖ్య అతిధిగా పిలిచి చక్కని అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు, శ్రద్ధగా విన్నందుకు పాల్గొన్న సాహిత్యాభిమానులకు, కవిసమ్మేళనంలో చక్కని కవితలు వినిపించినందుకు కవులకు ధన్యవాదాలు తెలిపారు.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ అతిధి ఫణీంద్ర గారికి, సభా నిర్వాహకురాలు గీతా మాధవి గారికి  మరియు చక్కని కవితలు వినిపించిన కవులకు ధన్యవాదాలు చెప్పి సభను ముగించారు.అవకాశం ఇచ్చినందుకు కవులు ధన్యవాదాలు చెప్పి, తమ సంతోషమును వ్యక్తపరచి, వచ్చేనెల సమావేశంలో తప్పక పాల్గొంటామని అప్పటి వరకు ఎదురుచూస్తుంటామని చెప్పారు.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, వీక్షణం భారత దేశ ప్రతినిధి.


Comments

Popular posts from this blog