ఆమె అపరూపి అసమాన్వి (నా కవితా సుందరి)
ఆమె నాకు వెలుగు - ఆమె నాకు తెరువు
ఆమె నాకు పుష్పము - ఆమె నాకు సౌరభము
ఆమె నాకు మార్గదర్శి - ఆమె నాకు జ్యోతిర్మయి
ఆమె నాకు కలము - ఆమె నాకు కాగితము
ఆమె నాకు ప్రాణము - ఆమె నాకు మానము
ఆమె నాకు స్ఫూర్తిప్రదాత - ఆమె నాకు కీర్తిపతాక
ఆమె నాకు తేనెజల్లు - ఆమె నాకు రసపట్టు
ఆమె నాకు చక్కనితోడు - ఆమె నాకు సరిజోడు
ఆమె నాకు అక్షరము - ఆమె నాకు పదము
ఆమె నాకు అందము - ఆమె నాకు ఆనందము
ఆమె నాకు ఊహ - ఆమె నాకు శ్వాస
ఆమె నాకు జాబిలి - ఆమె నాకు కౌముది
ఆమె నాకు పొదరిల్లు - ఆమె నాకు హరివిల్లు
ఆమె నాకు స్వప్నము - ఆమె నాకు కావ్యము
ఆమె నాకు లోగిలి - ఆమె నాకు కౌగిలి
ఆమె నాకు సరసము - ఆమె నాకు విరహము
నా లోపల ఆమే - ఆమె బయట నేనే
నా ప్రేమ ఆమెమీదే - ఆమె వలపు నామీదే
నా భావాలు ఆమెవే - నా విషయాలు ఆమెవే
నా వ్రాతలు ఆమెవే - నా కవితలు ఆమెవే
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment