అటు చూడండి (ప్రకృతి సాక్షి)
మబ్బులు తేలుతున్నాయి
చినుకులు రాలుస్తున్నాయి
తారకలు పొడుచుకొస్తున్నాయి
తళుకులు విసురుతున్నాయి
పుడమి తడుస్తుంది
మొక్కలు తన్నుకొస్తున్నాయి
నీరు ప్రవహిస్తుంది
నదులు పారుతున్నాయి
గాలి వీస్తుంది
హోరు వినబడుతుంది
చెట్లు ఊగుతున్నాయి
తలలు ఆడిస్తున్నాయి
పూలు పిలుస్తున్నాయి
పొంకాలు చూపుతున్నాయి
పండ్లు పండిపోతున్నాయి
నోర్లను ఊరిస్తున్నాయి
అద్భుతప్రకృతి అలరిస్తుంది
అందచందాలు చూపుతుంది
ఆనందాలు అందిస్తుంది
అంతరంగాలను ముట్టుకుంటుంది
అక్షరాలు అల్లుకుంటున్నాయి
పదాలు ప్రాకుతున్నాయి
కవితలు పుట్టకొస్తున్నాయి
హృదులను మురిపిస్తున్నాయి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Comments
Post a Comment