కోక
కోక
భారత సంస్కృతికి ప్రతిరూపం
భామల సంపత్తికి ప్రామాణికం
కోక
అందాల భరితం
ఆనందాల జనితం
కోక
రంగుల రమణీయం
హంగుల లావణ్యం
కోక
సింగార సూచకం
శృంగార ప్రేరకం
కోక
కప్పుకంటే సుందరం
విప్పుకుంటే ఉద్వేగం
కోక
తిప్పి దోపుకుంటే శౌర్యం
నెత్తిన కప్పుకుంటే వినయం
కోక
కప్పుకుంటే వస్త్రం
కొంగుతీస్తే ఆయుధం
కోక
విసురుకుంటే పంకా
తుడుచుకుంటే చేతిగుడ్డ
కోక
పట్టుదయితే గర్వాన్న్వితం
నేతదయితే సౌకర్యవంతం
కోక
కొంటే ఇంట్లోపర్వదినం
చినిగితే కొంపలోశోకం
కోక
కొంగు బంగారమయం
చెంగు సరససల్లాపం
కోక
అబలల ఆత్మగౌరవం
ఉవిదల హృదయరంజకం
కోకలను
కోమలాంగులకు పంచుదాం
కట్టించి కుతూహలపరుద్దాం
కోక
మహిళల మనసుల ప్రతిబింబం
సంస్కృతీ చిహ్నం సౌందర్యదీపం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment