ఎద సొద
ఎదలో ఒకటే సొద
కలం చేతపట్టమని
కమ్మగా వ్రాయమని
కళాత్మకం చేయమని
కవితాజల్లులు కురిపించమని
కవనజ్యోతులు వెలిగించమని
భావధారలు పారించమని
హృదయధ్వనులు పలికించమని
అనుభవాలు తెలుపమని
అనుభూతులు చెప్పమని
తెలుగును కీర్తించమని
తేనియలు చిందించమని
సుమాలు చల్లమని
సౌరభాలు చిమ్మమని
మాధుర్యాలు అందించమని
ఆదరాభిమానాలు చూరగొనమని
కవిత్వామృతము కార్చమని
కొత్తదనమును చూపించమని
మదులను మురిపించమని
హృదులను ఆకట్టుకొమ్మని
కవిత్వాన్ని ఆస్వాదింపజేయమని
కవులను ఆదరించేలాచూడమని
సాహిత్యరాగాలు వినిపించమని
సాహితీప్రియుల సంతసపరచమని
ఎదలో జ్వలించే సొదలు
చల్లుతాయి కవితా వెలుగులు
తడతాయి కవిత్వ హృదయాలు
అందిస్తాయి కవన విందులు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Comments
Post a Comment