నా కలం


నా కలం – నా గళం,

నా బలం – నా ప్రాణం.

నా కలం – నా హలం,

నా పరికరం – నా ఆయుధం.


నా కలం – నా అక్షరం,

నా పదం – నా ఆయుధం.

నా కలం – నా కుంచె,

నా సుత్తి – నా సమ్మెట.


నా కలం – నా వరం,

నా ఫలం – నా రూపం.

నా కలం – నా పద్యం,

నా గీతం – నా కవిత్వం.


నా కలం – నా హృదయం,

నా కరదీపం – నా ప్రకాశం.

నా కలం – నా అందం,

నా ఆనందం – నా అంతరంగం.


నా కలం – నా పుష్పం,

నా పరిమళం – నా పరవశం.

నా కలం – నా దర్పణం,

నా ప్రతిబింబం – నా మనోఫలకం.


నా కలం – నా చిత్రం,

నా శిల్పం – నా ప్రతిరూపం.

నేనే కలము – కలమే నేను,

నాకలందే శైలి – శైలిదే నాకలం.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog