ఒక్కోసారి....
ఒక్కోసారి
పువ్వునైపోతా
పులకరింపజేస్తా
ఒక్కోమారు
నవ్వునైపోతా
మోమును వెలిగిస్తా
ఒక్కోరోజు
పరిమళమైపోతా
పరిసరాల వ్యాపిస్తా
ఒక్కో సమయాన
అందమైపోతా
అలరింపజేస్తా
ఒక్కోపొద్దు
తేనెనైపోతా
పలుకుల్లో వెలువడుతా
ఒక్కోకాలాన
రంగులైనైపోతా
హరివిల్లును సృష్టిస్తా
ఒక్కోసందర్భాన
ఆహారమైపోతా
కడుపు నింపుతా
ఒక్కో క్షణాన
నీరైపోతా
దప్పిక తీరుస్తా
ఒక్కో నిమిషాన
శబ్దమైపోతా
శ్రావ్యత అందిస్తా
ఒక్కోపూట
వెలుగునైపోతా
దారిని చూపిస్తా
నేను కాదు రవిని
నేను ఒక కవిని
నేను ఇస్తా కవితలని
నన్ను
గుర్తించుకుంటావా
మదిలో దాచుకుంటావా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment