అందచందాలు


అందాల దృశ్యం 

ఆహ్వానిస్తుంది

సుందర ప్రదేశం 

స్వాగతిస్తుంది


పొంకాల పుష్పం 

పరిమళిస్తుంది

చక్కని సీతాకోకచిలుక 

వన్నెలుచూపుతుంది 


ముద్దుల పాపాయి 

మురిపిస్తుంది

కమ్మనీయ కడలి 

కుతూహలపరుస్తుంది


సుందర రూపం 

ఆస్వాదించమంటుంది

హృద్య వర్ణం 

కనువిందు చేస్తుంది


ఇంపైన గీతం 

ఆలకించమంటుంది

సొంపైన రాగం 

శ్రావ్యత నింపుతుంది


ఆహ్లాద వదనం 

వెలిగిపోతుంది

ఆకర్షణీయ దేహం 

అబ్బురపరుస్తుంది


సొగసలు 

సయ్యాటకు రమ్మంటాయి 

సొబగులు 

మాధుర్యమును పంచుతాయి 


సోయగాలు 

మదిని కట్టేస్తాయి 

శోభలు 

హృదిని ముట్టేస్తాయి 


సవురు 

మనసుల లాగుతుంది 

హరువు 

తనువుల లాలిస్తుంది


చెన్ను 

ఉల్లాల చెలరేగిస్తుంది 

టెక్కు 

సంతసాల చేకూరుస్తుంది     


జిలుగులు మెరుస్తూ 

కళకళలాడుతాయి

బెళుకులు రగులుతూ 

ధగధగలాడుతాయి


ఆందం 

అలరిస్తుంది పులకరిస్తుంది 

చందం 

కదిలిస్తుంది కుదిపేస్తుంది 


అందంలేని మోములు 

కళావిహీనం

చందంలేని చూపులు 

నిష్ప్రయోజనం 


సౌందర్యమే సదా 

ఆనందమయం

చక్కదనమే ఎల్లప్పుడూ 

ఆహ్లాదభరితం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog