ఎందుకో?


కలగని

తృప్తిపడితిని

కల్లయని

తెలిసికూడా


ఊహించి

సంతసించితిని

నిజముకాదని

తెలిసికూడా


చెమటోడ్చితి

సాధించితిని

ప్రయోజనములేదని

తెలిసికూడా


వెంటబడి

దారికితెచ్చితిని

మొండిఘటమని

తెలిసికూడా


ఇష్టపడి

ఊడిగంచేసితిని

నష్టమేనని

తెలిసికూడా


ప్రేమించి

భంగపడితిని

అత్యాశేనని

తెలిసికూడా


కవ్వించి

కాలుదువ్వితిని

విజయందుర్లభమని

తెలిసికూడా


దుష్కర్మలుచేసితి

పాపమునొడికట్టుకుంటిని

నరకంతప్పదని

తెలిసికూడా


సలహాలడుగుచుంటి

బంధుమిత్రులని

పరిహారములేదని

తెలిసికూడా


పూజలుచేయుచుంటిని

కాపాడమనిదేవుళ్ళకి

క్షమించుటకష్టమని

తెలిసికూడా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog