వెలుగుల వర్ణమాల


వెలుగులు

వెంటపడుతున్నాయి

కలమును

చేపట్టమంటున్నాయి


వెలుగులు

విస్తరిస్తున్నాయి

నిజాలను

తెలియజేస్తున్నాయి


వెలుగులు

చీకట్లనుచీల్చుతున్నాయి

ఆశలతలుపులను

నెమ్మదిగాతెరుస్తున్నాయి


వెలుగులు

కళ్ళల్లోపడుతున్నాయి

విశ్వమును

వీక్షించమంటున్నాయి


వెలుగులు

మదులనుముట్టుతున్నాయి

భయాలను

మటుమాయంచేస్తున్నాయి


వెలుగులు

దారిచూపుతున్నాయి

కాళ్ళను

కదిలించుతున్నాయి


వెలుగులు

దీపాలనుండిపుడుతున్నాయి

జీవితాలకు

అర్ధాలనుచెపుతున్నాయి


వెలుగులు

పంచమంటున్నాయి

అఙ్ఞానమును

తరుమమంటున్నాయి


వెలుగులు

హృదులనుతాకుతున్నాయి

అంతరంగాలను

ఆలోచనలలోముంచుతున్నాయి


వెలుగులు

అక్షరాలపైపడుతున్నాయి

పుటలను

ప్రకాశింపజేస్తున్నాయి


వెలుగులను

విరజిమ్ముదాం

ఉల్లాలను

ఉత్తేజపరుద్దాం


వెలుగులను

ఆహ్వానించుదాం

విశ్వమును

పరిశోధించుదాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog