నవ్వులు పువ్వులు


నవ్వులు

వదన వెలుగులు

సూటి సందేశాలు

మనో సంతసాలు


నవ్వులు

తెల్లని మల్లియలు

ముద్ద మందారాలు

ఎర్రని గులాబీలు


నవ్వులు

సూర్యుని కిరణాలు

జాబిలి వెన్నెలలు

తారల తళుకులు


నవ్వులు

పకపకలు

తళతళలు

నవనవలు


నవ్వులు

ఆణిముత్యాలు

నవరత్నాలు

సప్తవర్ణాలు


నవ్వులు

అందాల దృశ్యాలు

ఆనంద భావాలు

అంతరంగ సూచికలు


నవ్వులు

హృదయపు తలుపులు

తిన్నగా తెరిచే

తీయని తాళాలు


నవ్వులు

చీకటి ముడులను

విప్పి వేసే

వెలుగు రేఖలు


నవ్వులు

పంచుకుంటే

మోమునపూచే పువ్వులు

పరిసరాలచల్లే పరిమళాలు


నవ్వులు

మనుషులకు

అందమైన

ఆభరణాలు


నవ్వులు

ఆశల ఆహ్వానాలు

అలసిన మదులకు

అమృతపు చుక్కలు


నవ్వులను

స్వాగతిద్దాము

పువ్వులను

వెదజల్లుదాము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog