పొగడ్తలు
పొగడ్తలు
పూల వర్షాల్లా కురిసితే
మనసు మైదానంలో
ఆత్మవిశ్వాసం మొలుస్తుంది
పొగడ్తలు
మంచి మాటలై తాకితే
అలసిన అడుగులు కూడా
మళ్ళీ దారి పట్టుతాయి
పొగడ్తలు
అద్దంలా నిజాన్ని చూపితే
అహంకారము నశిస్తుంది
ఆత్మపరిశీలన పెరుగుతుంది
పొగడ్తలు
అతి కాకుంటే
ప్రతిభకు ప్రేరణ లభిస్తుంది
ప్రయాణానికి బలం కలుగుతుంది
నిజమైన పొగడ్త
మదుల నుంచి పుట్టి
హృదయాలకు చేరుతుంది
మనిషిని మంచివాడిని చేస్తుంది
పొగడ్తలకు
పొంగకు లొంగకు
పొగడ్తలను
ఆశించకు విశ్వచించకు
గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, భాగ్యనగరం9177915285
Comments
Post a Comment