కవిగారి స్వగతం
(కవితాపైత్యం)
కవితలు పుటలకెక్కిస్తా
సాహితీప్రియులకు అందించి
కమ్మదనాలు చేకూరుస్తా
కవితలు వినిపించుతా
శ్రావ్యంగా పాడి
శ్రోతలను అలరించుతా
కవితలు వెలిగిస్తా
కాంతులు ప్రసరించి
వాఙ్ఞయలోకాన్ని ప్రభవిస్తా
కవితలు పారిస్తా
సాహిత్యక్షేత్రాలను
సుసంపన్నం చేస్తా
కవితలు పూయిస్తా
అందాలు చూపించి
కయితానందాలను సమకూరుస్తా
కవితలు కాయిస్తా
తృప్తిగా ఆరగించమని
కవనప్రియులకు వడ్డిస్తా
కవితలు పండిస్తా
విరమించక
కవితాసేద్యమును కొనసాగిస్తా
కవితలు నాటుతా
ఏపుగా ఎదిగించి
సాహితీవనాన్ని సృష్టిస్తా
కవితలు వ్యాపించుతా
కవిరాజునై
కైతాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తా
కవితలు నేర్చుకుంటుంటా
ఇంకా ఇంకా
కయితారుచులు అందిస్తుంటా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment