కవిని


రోదసికి వెళ్ళివస్తా,

రిక్కలని సర్దివస్తా.

మేఘాలపై కూర్చుంటా,

పుడమిపై పరిభ్రమిస్తా.


అక్షరాలు కురిపిస్తా,

పదాలు పారిస్తా.

రవితో మాట్లాడుతా,

శశితో సంప్రదిస్తా.


వెలుగులు చిమ్ముతా,

వెన్నెలను వెదజల్లుతా.

మాటలు విసురుతా,

గళాలు తెరిపిస్తా.


ఊహలు ఊరిస్తా,

భావాలు తేలుస్తా.

పువ్వులు చల్లుతా,

నవ్వులు చిందిస్తా.


మల్లియలు పూయిస్తా,

సౌరభాలు వ్యాపిస్తా.

దండలు అల్లుతా,

మెడలు అలంకరిస్తా.


మదులను ముట్టుతా,

తనువులు తట్టుతా.

అందరినీ ఆహ్వానిస్తా,

ఆనందాల్లో ముంచేస్తా.


కలాన్ని వెలిగిస్తా.

పుటల్ని మెరిపిస్తా.

సాహిత్యాన్ని పోషించుతా,

పాఠకుల్ని ప్రోత్సహించుతా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog