మనిషి ఆరాట–పోరాటాలు


ఆశల అడుగుల్లో

ఆరాటం అంకురిస్తుంది

కలల గగనంలోకి

చూపులు విస్తరిస్తాయి


అడుగడుగునా అడ్డంకులు

అయినా ఆగకూడదు ప్రయాణం

పడిపోతే లేచినిలబడే

మనిషి మనోధైర్యమే ఆయుధం


పోరాటం అంటే యుద్ధం కాదు

లోపలి భయాలతో చేసే సమరం

ఆరాటం అంటే వృధా ప్రయాసకాదు

జీవితానికి అర్థం పరమార్ధం


చీకటి కమ్ముకున్నా

వెలుగును నమ్మే హృదయం

వెన్ను చూపని సంకల్పమే

విజయానికి తొలి సాక్ష్యం


గెలుపు ఓ మలుపు మాత్రమే

పరాజయం ఓ పాఠం

ఆరాట–పోరాటాల మధ్యే

సాగుతుంది జీవన పయనం


మానవులు లేనిదానికోసం 

మానుకోవాలి అర్రులుచాచటం

దొరికిందేచాలు అనుకోవటం 

నేర్చుకోవాలి మానవసమాజం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog