ఓ చిట్టి చిలకమ్మా!
గూట్లోకి
రమ్మంటావా
గూబలో
గుసగుసలాడమంటావా
గూడులోకి
దూరమంటావా
గణగణమని
గంటలుమ్రోగించమంటావా
గుమ్మం
బార్లాతెరుస్తావా
లోనికి
సాదరంగాస్వాగతిస్తావా
గోరుముద్దలు
పెడతాతింటావా
గుటగుటా
గుటుక్కునమ్రింగుతావా
గుడిసెను
పావనంచేయమంటావా
గుడిని
తలపించమంటావా
గులాబీలు
గంపెడుతెమ్మంటావా
గృహాన్ని
గుబాళింపజేయమంటావా
గింజలు
చేతికివ్వమంటావా
గొంతులోకి
క్రుక్కమంటావా
కొత్తగుడారం
కట్టివ్వమంటావా
క్రొత్తకాపురం
పెట్టించమంటావా
గగనమంతా
ఎగురుతావా
విహారయాత్రలు
చేసివస్తావా
గుడ్లును
పెడతావా
గబాలున
పొదుగుతావా
గుడ్ బై
చెప్పమంటావా
సెలవు
తీసుకోమంటావా
గడియ
వేసుకుంటావా
గమ్ముగా
నిద్రలోకిజారుకుంటావా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment