🙏🎉కొత్త సాలుకు స్వాగతం! సుస్వాగతం!!🎉🙏



అదిగో నవ్వుల పల్లకీలో…

నవవత్సరం కాంతుల్ని రత్నాల్ని చల్లుకుంటూవస్తుంది,

గతకాలపు గాయాలను గాలికి వదిలి,

రేపటికి మణుల్ని మాణిక్యాల్ని ఏరుకుందాం.



నిన్నటి నిట్టూర్పులను

నేటి నీలిమేఘాల జలధారలతో,

వేదనల వలలను

వెలుగుల వానతో కడిగేద్దాం.



పొద్దుటి పూల పరిమళంలా

పవిత్రమైన ఆశలు చల్లుతూ,

ప్రతి ఇంటి ముంగిట్లో

ప్రార్థనల దీపాలు వెలిగిద్దాం.



ఆశల అక్షరాలకు

అమృతపు అర్థాలు నింపుదాం,

మనసుల మల్లెలను

మంగళ సుగంధాలతో మురిపిద్దాం.



పాత ఏడాది పుటలను పాఠాల పుస్తకంగా మలిచి,

కొత్త ఏడాది పుటలపై కలల కవితలు వ్రాసేద్దాం.

కన్నీటి నీడలను కాంతి కిరణాలతో తొలగిస్తూ,

కష్టాల గోడలపై కొత్త ఆశల తలుపులు తెరుద్దాం.



పాత సాలుకు వీడుకోలు చెప్పుదాం,

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుదాం.

రేపటి వెలుగుల్ని వరాలుగా స్వీకరిద్దాం,


జీవన గగనాన్ని సుఖశాంతులతో నింపేద్దాం.



✒️గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం✒️



🙏🌼 కొత్త సాలుకు హృదయపూర్వక స్వాగతం! 🌼🙏

🌸🌸అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు 🌸🌸


Comments

Popular posts from this blog