ఓ కడుపుమండిన కవీ!
కలమును చేతపట్టు
కరవాలంలా విసురు
చెమటను చిందించు
రక్తాన్ని రగిలించు
నిప్పురవ్వలు క్రక్కు
అవినీతిని కాల్చు
గట్టిగా గళమునెత్తు
విషబాణాలు వదులు
ఉద్యమాలు చేయించు
విజయాలు సాధించు
చరిత్రపుటలకు ఎక్కు
చిరంజీవిగా నిలువు
సమాజశ్రేయస్సును కోరు
శుభకార్యాలను జరిపించు
జనాన్ని చైతన్యపరచు
ఇనుపసంకెళ్ళను తెంచు
అభివృద్ధిని ఆకాంక్షించు
సంక్షేమాన్ని సాధించు
కడుపుమండిన కవీ
కదులు ముందుకుకదులు
-- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment