మన ఆంధ్రా


ఆంధ్రుల గర్వం

భాగ్యనగరం

ఆంధ్రుల భవితవ్యం

అమరావతిపట్నం


ఆంధ్రుల తెలుగు

రంగుల వెలుగు

అంధ్రుల ఘనత

కాకతీయ చరిత


ఆంధ్రుల భూమి

అందాల స్వర్గం

ఆంధ్రుల కలిమి

ఆనంద తాండవం


ఆంధ్రుల తెలివి

జగతికి ఆదర్శం

ఆంధ్రుల సరణి

అనుసరణీయం


ఆంధ్రుల పలుకులు

తేనియల జల్లులు

ఆంధ్రుల పెదవులు

అమృత నిలయాలు


ఆంధ్రుల పద్యాలు

తెలుగోళ్ళ ప్రత్యేకము

ఆంధ్రుల గళాలు

గాంధర్వ గానాలు


ఆంధ్రుల ఖ్యాతి

అజరామరం

ఆంధ్రుల జాతి

అవనికితలమానికం


ఆంధ్రుల అక్షరాలు

గుండ్రని ముత్యాలు

ఆంధ్రుల పదాలు

అజంతా స్వరాలు


ఆంధ్రుల వరాలు

క్రిష్ణా-గోదావరులు

ఆంధ్రుల సిరులు

ఆత్మాభిమానాలు


ఆంధ్రదేశము

దేవతల నిలయము

ఆంధ్రుల ఆరాధ్యము

తిరుపతి వెంకటేశుడు


తెలుగుమాతకు

మల్లెలదండ అలంకారం 

త్రిలింగనేలకు

కర్పూర నీరాజనం


ఆంధ్రులకు జైకొట్టుదాం

తెలుగోళ్ళని పైకెత్తుదాం

తెనుగును తలకెత్తుకుందాం

అంధ్రవైభవాన్ని విశ్వానికిచాటుదాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog