మాటలు — మనసును మేల్కొలిపే మంత్రాలు
మాటలు
ఊహలను కదిలిస్తే
ఉషోదయాలే రూపమెత్తుతాయి
మాటలు
మనసును తట్టితే
మౌనాన్నే మేలుకొలుపుతాయి
మాటలు
హృదయాన్ని కట్టేస్తే
హరివిల్లులై మెరుస్తాయి
మాటలు
గుండెలను తాకితే
పద్మాలై వికసిస్తాయి
మాటలు
జీవితాన్ని పలికిస్తే
జ్యోతిరేఖలై జాగృతపరుస్తాయి
మాటలు
పదాలై ప్రకాశిస్తే
మదిపొంగులే కవితలవుతాయి
మధురమాటలు
ఎప్పుడైనా - ఎక్కడైనా
అంతరంగాలను అంటుకుంటాయి
మంచిమాటలు
ఎవరివైనా- ఎందుకైనా
ప్రేరణలై కదిలిస్తాయి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment