వింతలోకం


చెప్పమనేవారు కొందరు

చేయమనేవారు మరికొందరు

కుదించమనేవారు కొందరు

సాగించమనేవారు మరికొందరు


పొంగి పొగిడేవారు కొందరు

కృంగి తెగిడేవారు మరికొందరు

కలంపట్టి రాయమనేవారు కొందరు

గళమెత్తి పాడమనేవారు మరికొందరు


భరించేవారు కొందరు

భారమయ్యేవారు మరికొందరు

సూచించేవారు కొందరు

నిరసించేవారు మరికొందరు


దాచుకునేవారు కొందరు

దోచుకునేవారు మరికొందరు

శ్రమించేవారు కొందరు

శయనించేవారు మరికొందరు


ఇదే మన వింతలోకం

ఇదే జన వైవిధ్యం

కొందరు నింపేవారు

మరికొందరు ఖాళీచేసేవారు


ఇదంతా విచిత్రలోకం

మనమే తీర్చిదిద్దేలోకం

మంచి మనుషులలోకం

మారుస్తుంది ఈలోకం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog