Posts

 నా పయనం ఈ పయనం నేను కావాలనుకున్నదే ఈ వాహనం నేను ఎక్కాలనుకున్నదే ఆ గమ్యస్థానం నేను కోరుకున్నదే ఆ వెళ్ళేమార్గం నేను ఇష్టపడిందే అంధకారాన్ని వీడుతున్నా వెలుతురుతావుకి చేరబోతున్నా మరో ఆలోచనను చేయటంలా వేరే మార్గమును వెదకటంలా ఊహలలోకంలో విహరిస్తా కవనజగతిలో కాలంగడుపుతా అక్షరాలతో ఆడతా పదాలతో పయనిస్తా భావాలను బయటపెడతా విషయాలను వెల్లడించుతా కవితలను సృష్టిస్తా మనసులను దోచేస్తా సాహిత్యలోకం నా స్వర్గం పాఠకలోకం నా లక్ష్యం హయగ్రీవుని అర్ధిస్తా పలుకులమ్మని ప్రార్ధిస్తా నా పయనంలో తోడుగావస్తారా నా ప్రయత్నంలో సహకరించుతారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 మా ఊరు మా ఊరు ఎన్నిసార్లు కాపాడిందో నన్ను కంటికిరెప్పలా  మా అమ్మ ఎట్లా పెంచిందో నన్ను అల్లారుముద్దుగా మా నాన్న ఎలా కాపాడాడో నన్ను కష్టాలపాలుచేయకుండా మా బడి ఏలా తీర్చిదిద్దిందో నన్ను తెలివైనవాడిగా మా గురువులు ఏమి శ్రద్ధతీసుకున్నారో నన్ను ఉన్నతుడినిచేసేలా మా నేల ఎంత సారవంతమో పంటలుపెంచటానికి దండిగా మా తోటపండ్లు ఎంత రుచికరమో తినటానికి తృప్తిగా  మా ఏరు ఎలా నీటినిస్తుందో అన్ని ఋతువుల్లోనూ మా చెరువు ఎలా ఈతకొట్టించిందో నీళ్ళపై తేలుస్తూ మా ఊరబావి ఏమి ఊరుతుందో సరిపడా నీరుతోడుకొమ్మంటూ మా ఊరివారు ఏమిగౌరవిస్తారో ఊరిలోకి అడుగుపెట్టగానే మా పోలేరు ఎన్నిసార్లు వానలుకురిపించిందో పూజచేసి కోరగానే మా వేణుస్వామి ఎలా నడిపించారో నాజీవితపయనాన్ని గమనించుతూ ఊరుకి ప్రణామాలు ఊరువారికి ధన్యవాదాలు పోలేరమ్మకు పప్పుబెల్లాలు కృష్ణరుక్మిణీసత్యలకు కళ్యాణోత్సవాలు పెద్దలకు నమస్కారాలు పిల్లలకు దీవెనలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నాతలలోని తలపులు తలలోతట్టిన తలపులను తేటతెలుగులో తియ్యగాచెప్పాలనుకుంటున్నా బుర్రలోతట్టిన ఊహలను మూటకట్టి భద్రపరచాలనుకుంటున్నా కలలోకొచ్చిన సంగతులను కట్టగట్టి దాచిపెట్టుకోవాలనుకుంటున్నా మధురమైన ఙ్ఞాపకాలను మంచికవితలుగాకూర్చి ముచ్చటతీర్చుకోవాలనుకుంటున్నా కమ్మనైన విషయాలను కాగితాలపైచెక్కి కుతూహలపడాలనుకుంటున్నా అందమైన దృశ్యాలను కళ్ళల్లోబంధించి పుటలకెక్కించాలనుకుంటున్నా అందిన ఆనందాలను అచ్చతెలుగులోకిమార్చి ఆహ్లాదపరచాలనుకుంటున్నా కలంచెప్పిన కవితలను పాఠకులకుపంపి పరవశపరచాలనుకుంటున్నా తలపులతట్టను తలకెత్తుతా భారాన్ని భరిస్తారా తియ్యనికైతలను వడ్డిస్తా తనివితీరా ఆస్వాదిస్తారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 పదలాలిత్యం పదాలతో ఆడుకుంటా పెదాలతో పలికించుతా పదాలను పద్ధతి ప్రకారం పేరుస్తా పదాలను నిర్దేశించిన క్రమంలో పొసుగుతా పదాలను ఒకే రీతిలో నడిపిస్తా పదాలను వరుసలోవాడి పంక్తులను నిర్మాణంచేస్తా పదాలను లయాత్మకంగా సంధించి పఠింపజేస్తా పదాలకు ప్రాసలు జోడించి పాడించుతా అరుదైన పదాలనువాడి వాడుకను పెంచుతా చచ్చిన పదాలకు ప్రాణంపోసి బ్రతికిస్తా కొత్త పదాలను సృష్టించి ముందుంచుతా పదాలను వండి వార్చి వడ్డించుతా పదాలను నాటి పెంచి పండిస్తా పదాలను వెలిగించి కాంతులు చిమ్మిస్తా పదాలకు పూలుపెట్టి అందాలను చూపిస్తా పదాలకు పరిమళాలద్ది పీల్చేవారికి ప్రమోదంకలిగిస్తా పదాలకు తేనెనుపూచి పెదవులకుతాకించి చప్పరింపజేస్తా పదాలకు అమృతమురాసి నాలుకలకు అందిస్తా పదాలను ఏరికూర్చి పలుకులమ్మను ప్రార్ధిస్తా పదకౌశలమును ప్రదర్శించుతా పదవిన్యాసాలను పరికింపజేస్తా పదాలతోనాట్యము చేయిస్తా పదలాలిత్యము చూపిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 తెలుగోడా తెలుసుకో! ఆంధ్రాప్రాంతం విడిపోయింది కాని తెలుగుప్రజలు వేరుపడలేదని తెలుసుకో ఆంధ్రారాష్ట్రం కుచించింది కాని తెలుగుభాష తరగలేదని గుర్తించుకో ఆంధ్రాపెత్తనం తగ్గియుండవచ్చు కాని తెలుగోళ్ళపౌరుషం తాకట్టు పెట్టలేదనుకో అంధ్రాగాలులు వీచకపోవచ్చు కాని తెలుగుచైతన్యము అణగిపోలేదనుకో ఆంధ్రులసమైక్యత దెబ్బతినవచ్చు కాని తెలుగుజాతిని అవమానానికి గురిచేయకురో ఆంధ్రా ఓటర్లు అమాయకులు కాని  తెలుగువారిని ఆశపెట్టి ఎన్నికలలోమోసం చేయనీయవద్దురో ఆంధ్రులకు భాషాభిమానం లేదనంటారు కాని తెలుగులమదులలలో తెలుగుతల్లి కొలువుతీరియున్నది దర్శించుకో ఆంధ్రులనాయకత్వం అప్రతిష్టపాలుకావచ్చు కాని ఆంధ్రులప్రతిభ అసమాన్యమైనదని తెలుపరో అంధ్రాజనం అభిమానవంతులు కావచ్చుకాని వారు వెర్రివాళ్ళుకాదని విశ్వానికి చాటరో ఆంధ్రారైతులకు కలసిరాకపోవచ్చు కాని తెలుగుసేద్యగాళ్ళు సోమరుల కాదనిచెప్పరో ఆంధ్రాకవితలు తక్కువ కావచ్చుకాని తెలుగుకవులు నిష్ణాతులని చెప్పరో ఆంధ్రులుగొప్పలు చెప్పుకునేవారుకాదు కాని తెలుగుప్రాణులు తీపికాపలుకుతాయని చూపరో తెలుగుకు తక్కువచేస్తే తిరగబడతా గళమెత్తుతా ఆంధ్రులను అవమానపరిస్తే ఉద్యమిస్తా కసితీర్చుకుంటా గుండ్లపల్లి రాజ...
 పోతేపోనీ! గడచిపోయిన వెన్నెలరాత్రిని నిత్యమూ కావాలనికోరకు వాడిపోయిన పువ్వును తిరిగి వికసించమనకు విడిచిపోయిన నవ్వును మరలా మోమునావరించమనకు జరిగిపోయిన విషయాలను మరీమరీ మననంచేసుకోకు గతించిన కాలాన్ని మరలమరలా తలచుకోకు గడచిపోయిన ప్రాయాన్ని మళ్ళీ పొందాలనుకోకు చెదిరిపోయిన కలను మరోసారి రమ్మనికోరకు చిక్కినదాన్ని చప్పరిస్తూ పాతరోజులమిఠాయిని గుర్తుకుతెచ్చుకోకు మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరవాలనుకోకు తీరని  కోరికలకై పదేపదే తపించకు ఇంకిపోయిన నదిని గతంలా లేచిప్రవహించమనకు నిన్నటి విషయాలు మరచిపో రేపటి  సంగతులు తలచుకో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నిత్యోదయాలు  నిత్యోదయాలు నిత్యావస్థలు నిత్యకర్మలు నవీకరించి చెప్పమంటున్నాయి ప్రభాత గాలి తనువును తాకి మెల్లగా లేపి  మంచంపై కూర్చోబెడుతుంది ఉదయపు కాంతి కిటికీనుంచి దూరి కళ్ళలోకి ప్రవేశించి లేచి నిలబెట్టిస్తుంది పక్షులుకిలకిలా అరచి బద్ధకంవిడిచి లెమ్మని బయటకురమ్మని గోలచేసి ఉద్యానవనాల్లో నడవమంటాయి గుడిలో గంటలుమ్రోగి సుప్రభాతగేయాలు వినిపించి రారమ్మంటూ పిలిచి భక్తిని పెంపొందిస్తాయి వేడివేడికాఫీ వెంటనేత్రాగమని వంటికి వేడెక్కించమని దేహాన్ని ఉత్సాహపరచి దైనందిన కార్యాల్లోకిదించుతాయి  దినపత్రిక వరండాలోపడి తాజాతాజావార్తలు చదవమని మనసును తట్టి తలుపును తెరిపిస్తుంది మదిలో ఆలోచనలుపారి పనులకు ఉసిగొలిపి ప్రణాళికను ఇచ్చి కార్యాలను అప్పగిస్తాయి కడుపుఖాళీ అయి ఆకలి అయి అల్పాహారం తీసుకోమని పేగులు గొడవచేస్తాయి కలము చేతికెక్కి కాగితాలపైచెక్కించి కమ్మనికవితను కూర్పించి పత్రికలకుసమూహాలకు పంపమంటుంది పాఠకలోకం ప్రశంసిస్తే పరవశం సాహిత్యలోకం సన్నుతిస్తే సంతోషం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం