Posts

Showing posts from May, 2026
Image
కవితా వైభవం కవితలకు...శీర్షిక తలమానికం — చదివే మనసుకు తొలి చిరునవ్వు, కవితామందిరానికి సుందర ద్వారం, పాఠకుని ఆకర్షించే పుష్పమాలికలో తొలిపుష్పం॥ కవితలకు...అంశం ప్రధానం — భావాలకు బలమైన పునాది, ఆలోచనలకు ఆకాశవీధి, అర్థవంతమైన సందేశాలకు అక్షరాధారం॥ కవితలకు...శైలి ప్రాణం — పదాలకు పరిమళం పూయించేది, భావాలకు భంగిమలు అద్దేది, తేనెజల్లులు కురిపించే కవికంఠ మాధుర్యం॥ కవితలకు...ఆరంభం ఆకర్షణీయం — ఉదయభానుని తొలి కిరణంలా, వీణానాదపు తొలి స్వరంలా, పాఠకుని మనసును కట్టిపడేసే అమృతపలుకుల ఆహ్వానం॥ కవితలకు...ముగింపు మననీయం — మనసులో ముద్ర వేసేది, ఆలోచనల్లో అలలు రేపేది, చదివిన తరువాత కూడా చిరకాలం వెంటాడే జ్ఞాపకం॥ కవితలకు...పోలికలు అలంకారం — పూలకు పరిమళాలైనట్లు, చంద్రునికి వెన్నెలైనట్లు, భావాలకు సొబగులు చేకూర్చే సాహిత్య సుందరాభరణం॥ కవితలకు...మదులముట్టటం ప్రశస్తం — హృదయతంత్రులను మీటి, అంతరంగాలను తట్టి, ఆనందాశ్రువులను కార్పించి  ఆత్మను ఆలోచనల్లో ముంచటం॥ కవితలు... కళ్ళకు చూపాలి అందం, కర్ణాలకు పంచాలి పరమానందం, పెదాలకు పూయాలి మకరందం, మదులకు అందించాలి అరవిందం॥   అందుకే...కవిత అంటే కాదు అక్షరాల ప్రవాహం, అది హృదయస...
Image
 భావ సౌరభాలు మధురభావాలు మదిలో మొలకెత్తి, మల్లెల పరిమళాలు వెదజల్లుతున్నాయి॥ ఉన్నతభావాలు హృదయంలో ఉప్పొంగి, గోదారి గలగలలు వినిపిస్తున్నాయి॥ చక్కనిభావాలు చిన్నగా చిగురించి, చామంతుల నవ్వులను విరజిమ్ముతున్నాయి॥ మనోభావాలు మధువుగా మారి, మనసుల మధ్య  వంతెనలు కడుతున్నాయి॥ విచిత్రభావాలు విహంగాలుగా ఎగిరి, విశ్వ విహారాలకు తీసుకెళ్తున్నాయి॥ హావభావాలు హృదయ భాషలై, హర్షానందాలను పలికిస్తున్నాయి॥ సాత్వికభావాలు సవ్వడులు చేస్తూ, శాంతిసౌఖ్యాలను సమకూరుస్తున్నాయి॥ సాహితీభావాలు సరస్వతీ వరాలై, సృజనకు సరికొత్త రెక్కలు తొడుగుతున్నాయి॥ భావసంపదలు  కవుల పాలిట కల్పవృక్షాలై,  కమ్మని కవితలను  కూర్పిస్తున్నాయి॥ భావసౌందర్యాలు పాఠకుల పాలిట పంచామృతాలై, ఆనంద రాగాలను ఆలపింపజేస్తున్నాయి॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 పిల్లలు - భావి భారత భాగ్యవిధాతలు పిల్లలు… పరమాత్ముని ప్రసాదాలు — పుడమికొచ్చిన పూర్వజన్మ పుణ్యఫలాలు, ఇంటింటి ఇంద్రధనుస్సులు, ఇలవేల్పుల ఆనందతరంగాలు॥ పిల్లలు… పూలతోటలో పూసిన పుష్పాలు — పరిమళాల పూదండలు, పసితనపు పవిత్ర గీతాలు, ప్రేమకు ప్రతిరూపాలు॥ పిల్లలు… ఉదయించే సూర్యకిరణాలు — ఉజ్వల భవిష్యత్తు బాటసారులు, ఉత్సాహాల ఊటలు, ఉన్నతశిఖరాల అధిరోహకులు॥ ప్రతినిత్యమూ గమనించు — వారి అడుగుల్లో ఆశలు ఉంటాయి, వారి ప్రశ్నల్లో విజ్ఞానం దాగి ఉంటుంది, వారి కలల్లో విశ్వమే విరాజిల్లుతుంది॥ ప్రేమతో పెంచు — ప్రాణంపెట్టి పరిరక్షించు, పొరపాట్లను సహనంతో సరిదిద్దు, పొగడ్తలతో ప్రోత్సహించు, పుణ్యమార్గంలో నడిపించు॥ ప్రీతితో పోషించు — పోషకాహారమే కాదు, పొంగిపొర్లే మమకారాన్ని అందించు, పొదువైన సంస్కారాలను నేర్పించు, పొలిమేరలు దాటే వ్యక్తిత్వాన్ని నిర్మించు॥ పెద్దచదువులు చదివించు — పరిపూర్ణ జ్ఞానమందించు, పుస్తకాల వెలుగులు పంచు, పరిశోధనల పథంలో నడిపించు, ప్రపంచాన్ని అర్థం చేసుకునే దృష్టినివ్వు॥ ప్రయోజకులను చెయ్యి — పదవులకోసం కాదు, పరులకు ఉపయోగపడే మనుషులుగా తీర్చు, పరోపకారమే పరమధర్మమని నేర్పు, పాటుపడే పౌరుషాన్ని అలవర్చు॥ ప...
Image
 సాహితీసభల సందోహం అనేక సాహితీ సమావేశాలకు … అభిమానిగా హాజరయ్యా — అక్షరాల ఆహ్లాదాలను ఆస్వాదించా, కవుల కంఠాల్లోని కమ్మని కవిత్వాన్ని క్రోలుకున్నా॥ బహు సాహితీ సమావేశాల్లో … కవిగా పాల్గొన్నా — పదాలకు పరిమళాలు అద్దా, భావాలకు భాష్యమై హృదయాలను హత్తుకున్నా॥ చాలా సాహితీ సమావేశాలకు … సంధానకర్తగా సమన్వయపరచా — మనసులను మల్లెల దండలా కూర్చా, మాటలను మమతల మకరందాలుగా మేళవించా॥ పలు సాహితీ సమావేశాల్లో… అతిథిగా వేదికలపై ఆసీనుడనయ్యా — సభాస్థలాన్ని సాహితీ మందిరంగా తీర్చిదిద్దా, సాహిత్య సుగంధాలను సభలో వెదజల్లా॥ పెక్కు సాహితీ సమావేశాలను… కార్యకర్తగా ఏర్పాట్లు చేశా — శాలువాలు మరియు మెమెంటోలు చేకూర్చా, సాహితీ సేవకు సమయాన్నే సమర్పించా॥ స్వయంగా సాహితీ సమావేశాలను … నిర్వాహకుడిగా జరిపించా — సభలను సాఫల్యపథంలో నడిపించా, కవుల కీర్తిని కలకాలం నిలిపించా॥ ఎన్నో సాహితీ సమావేశాలకు … సాహితీ పోషకుడిగా సాయం అందించా — అక్షరాలకు అండగా నిలిచా, అభ్యుదయ భావాలకు ఆశ్రయమై నిలిచా॥ సాహితీ సమావేశాల సమీక్షలను … ప్రచారకుడిగా పత్రికలకు పంపా — కవిత్వ కాంతులను ప్రపంచానికందించా, తెలుగు తల్లి తేజాన్ని దిక్కులన్నిటా చాటించా॥ వివిధ సాహితీ సమావ...
Image
 కవితా మంజరి కవితా — ఊహల ఊటవి నువ్వు, ఎప్పుడు వస్తావో నీవు, ఎందుకు వస్తావో నీవు, ఎలా మాయమవుతావో నీవు॥ కవితా — సంతసానివి నువ్వు, సంబర పరుస్తావు నీవు, సవ్వడులు చేయిస్తావు నీవు, చిందులు తొక్కిస్తావు నీవు॥ కవితా — చక్కదనానివి నువ్వు, పసికందులా వస్తావు నీవు, పడుచులా మారుతావు నీవు, పసందు కలిగిస్తావు నీవు॥ కవితా — ప్రకాశించే పుష్పానివి నువ్వు, పరిమళాల పవనానివి నీవు, ప్రకృతికి ప్రతిబింబానివి నీవు, పాఠకులకు పసందువు నీవు॥ కవితా — పున్నమి జాబిలివి నువ్వు, తెల్లని వెలుగువు నీవు, చల్లని వెన్నెలవి నీవు, మెల్లని విహారివి నీవు॥ కవితా — కళ్ళకు అక్షరాలవు నువ్వు, పెదాలకు పదాలవు నీవు, మదులకు మత్తువి నీవు, హృదులకు కౌగిలివి నీవు॥ కవితా — లోకానికి లావణ్యానివి నువ్వు, అందంతో అలరిస్తావు నీవు, అలంకారాలతో ఆకర్షిస్తావు నీవు, ఆనందాల్లో ముంచేస్తావు నీవు॥ కవితా — సాహితీజగతిలో సుధవు నువ్వు, నోర్లను ఊరిస్తావు నీవు, అంతరంగాలను అంటుకుంటావు నీవు, అనంతమైన భావాలను మేల్కొల్పుతావు నీవు॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 రాస్తే... కలాలు హలాలను తలపించాలి, కాగితాలు కర్షకులను స్మరింపజేయాలి॥ అక్షరాలు అర్థవంతంగా ఉండాలి, పదములు ప్రబోధాత్మకంగా ఉండాలి॥ పువ్వులు పూయించేలా ఉండాలి, పరిమళాలు ప్రసరించేలా ఉండాలి॥ వెలుగులు వెదజిమ్మేలా ఉండాలి, చీకట్లు చెదరగొట్టేలా ఉండాలి॥ అందాలు అగుపించేలా ఉండాలి, ఆనందాలు అందించేలా ఉండాలి॥ వంటలు వడ్డించినట్లుగా ఉండాలి, కడుపులు కుతికలదాకా నింపేలాగుండాలి॥ రసాలు కార్పించేలా ఉండాలి, దప్పిక తీర్చేసేలా ఉండాలి॥ మిఠాయీలు మెక్కించేలా ఉండాలి, సంతసాలు సమకూర్చేలా ఉండాలి॥ తలలను తటాలున తట్టేలాగుండాలి, మదులను మెత్తగా ముట్టేలాగుండాలి॥ రాతలు రసాత్మకంగా ఉండాలి, కైతలు కవితాత్మకంగా ఉండాలి॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 నన్ను… నన్ను… పూలు ప్రలోభపెట్టాయి — పొదరిల్ల పొదువుల్లో పల్లకీ ఎక్కించి పున్నమి వెలుగుల వీధుల్లో ఊరేగించాయి॥ నన్ను… పరిమళాలు పసందుకొలిపాయి — పారిజాతపు పూవుల్లా పలకరించి పలుకులలో పంచదార తీపులు కలిపాయి॥ నన్ను… పడతులు ప్రేమలోకిదించారు — పలుకుల్లో పల్లవులై పలకరించి పసిడి నవ్వులతో ప్రణయ గీతాలు పాడించారు॥ నన్ను… పొంకాలు ప్రమోదపరచాయి — పొలిమేర గాలిలా విస్తరించి పొయ్యిమీద పాలులా పొంగిపొర్లాయి॥ నన్ను… ప్రభాకరుడు పొద్దుపొద్దునేలేపాడు — ప్రభాత కిరణాల పాన్పులో పడుకోబెట్టి ప్రపంచమంతా ప్రకాశించమని ప్రేరేపించాడు॥ నన్ను… పున్నమి జాబిలి పురికొలిపింది — పాలవెల్లి వెలుగులతో పాదాలపై పడిపోయి పుడమిపై పయనానికి పూలబాటలు పరిపించింది॥ నన్ను… ప్రకృతి పరవశపరచింది — పచ్చని పైరుల పలకరింపుల్లో పక్షుల గానాలతో పరిమళ గీతాలు వినిపించింది॥ నన్ను… పగటికలలు పెన్నును పట్టించాయి — పుటలపై పరవళ్ళు తొక్కే పదాలై పరవశ హృదయాల్లో ప్రవాహాలయ్యాయి॥ నన్ను… పదాలు పరుగులు తీయించాయి — పెళ్లి పందిరిలా పూలవాన కురిపించి ప్రతి అక్షరాన్నీ ప్రాణంగా మార్చించాయి॥ నన్ను… కవిత్వమే కట్టిపడేసింది — పలుకుల పల్లకీలో పరమానందం పంచి పుడమి గుండెలో పరి...
Image
 అక్షరసౌరభాలు అక్షరాలు అల్లుతా — కవితాహారాలు వేస్తా॥ అక్షరాలు చల్లుతా — కవితాసేద్యం చేస్తా॥ అక్షరాలు కురిపిస్తా — కవితాపంటలు పండిస్తా॥ అక్షరసుమాలు పూయిస్తా — పూపరిమళాలు చల్లుతా॥ అక్షరాలు పారిస్తా — కవితానదులు ప్రవహింపజేస్తా॥ అక్షరదీపాలు వెలిగిస్తా — కవితాకాంతులు వెదజల్లుతా॥ అక్షరాలను ఆడిస్తా — అంతరంగాలను తాకుతా॥ అక్షరాలను ప్రయోగిస్తా — అర్థాలను స్ఫురింపజేస్తా॥ అక్షరవిన్యాసాలు చేస్తా — హృదయాలను హత్తుకుంటా॥ అక్షరామృతం అందిస్తా — అమరలోకంలో విహరింపజేస్తా॥ — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 నేను… విడమఱచి చెబుతున్నా... నేను… గుండ్లను కాను — గుండ్లు విసిరేయను, గాయపరచను,  గుండెల్లో గుబాళించే గుసగుసల్ని  గీతలుగా గుమికూడించే గానామృత ప్రవాహాన్ని॥ నేను… పల్లిని కాను — పల్లెల పరిమళాల్ని  ప్రభాత సమయాన్నే  పదాలు పూయించే పచ్చని ప్రకృతి పలుకరింపుని॥ నేను… గుండ్లపల్లిని కాను — గుండెల నిండా  గులాబీలు గుబాళించే  మమతలు నాటే మాటల మల్లెతోటని॥ నేను… రాజును కాను — అధికారం కోసం అలమటించను,  రాజసింహాసనాలపై రారాజుగా కూర్చోను, రసహృదయాలపై రాజ్యమేలే రాగాల రత్నాకరాన్ని॥ నేను… ఇంద్రుడిని కాను — అమరావతిలో ఆడంబరాల అలంకారమై వెలగను, అక్షర మేఘాల నుంచి  ఆనంద వర్షాలు కురిపించే ఆత్మస్వరాన్ని॥ నేను… రాజేంద్రుని కాను — అమరేంద్రుని ఆసనాన్ని ఆశించను, రాజ్యాలకే పరిమితమైన పేరుకాను, రంజింపజేసే రాగభావాల రమ్య సంచారాన్ని॥ నేను… ప్రసాదుని కాను — గుడి గర్భగుడిలో పంచే నైవేద్యముకాను, దేవదేవుని వరప్రసాదాన్ని కాను, గుండెల గర్భంలో జారే గురుతరమైన ప్రేమామృతాన్ని॥ నేను… రాజేంద్రప్రసాదుని కాను — ఒక పేరులో బంధింపబడే మనిషినికాను, అక్షరాల ఆత్మను ఆవిష్కరించే ఆనంద కవినై నిలిచే అనంత స్పందనన...
Image
 నేను…  నేను… అక్షరాల్లో అగపడతా — అరుణోదయ కిరణంలా ఆత్మల్ని అలరిస్తా, అమృతధారలై అలసిన హృదయాల్లో జారిపడతా॥ నేను… పదాల్లో ప్రవహిస్తా — పర్వతాల పొంగులా పరవళ్ళు తొక్కుతా, పల్లె గాలిలో పాటై పసిహృదయాల్ని పలకరిస్తా॥ నేను… ఊహల్లో ఊరిస్తా — ఉయ్యాలలూపే వెన్నెలవై విరిసిపోతా, ఉన్నట్టుండి మనసు మట్టిలో మల్లెలై మొలకెత్తుతా॥ నేను… భావాల్లో భాసిల్లుతా — భానుడి బంగారు వెలుగులా బతుకులను నింపుతా, భక్తిలో భజనై, ప్రేమలో పరిమళమై పరుచుకుంటా॥ నేను… అంతరంగాలను ఆకట్టుకుంటా — అనుభూతుల అంచులపై ఆత్మీయతగా నర్తిస్తా, అలజడుల అలల మధ్య ఆశల దీపమై నిలుస్తా॥ నేను… హృదయాలను అంటుకుంటా — హంసనాద స్వరంలా హాయిగా హత్తుకుపోతా, హరివిల్లుల రంగులై హృదయవీధుల్లో విహరిస్తా॥ నేను… గుండెల్లో గుభాలిస్తా — గులాబీ సువాసనై గుబాళింపులు పంచుతా, గాయాల గర్భంలో గంగాజలమై గుండెల్ని శాంతింపజేస్తా॥ నేను…కవితల్లో కనిపిస్తుంటా — కాలానికీ కలానికీ కలువనై కలిసిపోతా, కన్నీటి చుక్కలో కాంతినై, నవ్వుల నదిలో నావనై నడుస్తుంటా॥ నేను… మాటల మకరందమై మానవత్వపు మల్లెల్ని వికసింపజేస్తా, భావాల భువనంలో భానుకిరణమై భావాల భువనంలో భానుకిరణమై సాహిత్య గగనంలో శాశ్వతంగా ...
Image
 నేను సైతం… నేను సైతం… ప్రపంచపు పగుళ్ల గోడలపై శాంతి పావురాల్ని చిత్రిస్తాను! రక్తపు చారల మధ్య రాగాల వర్షం కురిపిస్తాను॥ నేను సైతం… యుద్ధ యంత్రాల కర్కశ కేకల్లో మనిషి హృదయ స్వరాన్ని వినిపిస్తాను, బాంబుల పొగల వెనుక బాలల నవ్వుల దీపం వెలిగిస్తాను॥ నేను సైతం… ప్రపంచాభివృద్ధి అనే మహాయజ్ఞంలో ఒక చెమట చుక్కగా జారిపోతాను, కూలీల చేతుల్లో శక్తిగా మారుతాను పేదల పళ్లెంలో అన్నమై పడతాను॥ నేను సైతం… ప్రపంచక్షేమం కోసం ప్రతి గుండె గుమ్మాlni తట్టుతాను, కన్నీటి కడలిలో మునిగినవారికి కరుణా పడvanai చేరుతాను॥ నేను సైతం… ప్రపంచప్రేమ అనే జెండాను అన్ని దిక్కుల్లో ఎగరవేస్తాను, జాతి–మత–భాషల గోడల్ని జ్వాలల్లా కరిగిస్తాను॥ నేను సైతం… సాహిత్య సముద్రపు అలలపై అక్షర నౌకగా ప్రయాణిస్తాను, ప్రపంచసాహితీ పుటల మీద ప్రజల పలుకులై నిలిచిపోతాను॥ నేను సైతం… ప్రపంచవీధుల్లో పయనిస్తూ మనిషి మనిషికీ మధ్య  మమతా వంతెనలు వేస్తాను, మట్టిలో మగ్గిన ఆశలకు మళ్లీ రెక్కలు తొడుగుతాను॥ నేను సైతం… కాలం కదిలే రథచక్రానికి ఒక చిన్న ఊపిరినైనా అందిస్తాను, మానవతా మహాగీతంలో ఒక గర్జనగా మారిపోతాను॥ ఎందుకంటే— నేను ఒక్కడిని కాదు! నా వెనుక కోట్ల గుండెలు...
Image
 పాటల బాట – మాటల మూట పాటే మనసుకు మధురమైన తోట, మాటే మానవుని మాణిక్యపు కోట। భవితకు వెలుగులు చూపించే బాట, జీవితానికి ఆనందమందించే ఆట॥ ॥ పాటే ॥ తేటతెలుగు తేనెలా జారే పాట, పూటపూట నవ్వులు పూయించే మాట। మమతల్ని మోసే అక్షరాల మూట, విజయాలకు దారిచూపే పదాల వేట॥ ॥ పాటే ॥ పేటలో పులకరించే ప్రేమల జంట, ఇంటిలో పరిమళించే అమ్మ చేతి వంట। పండించాలి మనసులో మంచిగుణాల పంట, మండించాలి ధైర్యదీపాల వెలుగు మంట॥ ॥ పాటే ॥ ఊటలా ఊరటనిచ్చే స్నేహబాట, ఎటు చూసినా కనబడాలి ప్రేమ తోట। పుటపుటలో పరిమళించే జ్ఞానపాట, గంట గంటకూ మారాలి జీవనబాట॥ ॥ పాటే ॥ తాటిచెట్టు నీడలా బంధాల చోట, అటు ఇటు పరుగులు తీసే కాలబాట। ఇటు ఆనందం, అటు ఆశల వేట, పాటతో పరవశించే ఈ జగతి పేట॥ ॥ పాటే ॥ పాట ఉంటే పరిమళిస్తుంది ప్రాణం పూటపూట, మాట ఉంటే మధురమవుతుంది జీవనబాట। బాట మంచిదైతే నడుద్దాం లోకం దాట, ప్రతిపూట మనసారా ఆలపిద్దాం ప్రేమపాట॥ ॥ పాటే ॥ — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితా కల్యాణి కవిత ఒక వధువు — కలల కంచుకం కట్టుకుని మనసు మంటపంలోకి మెల్లగా అడుగుపెడుతుంది, భావాల తాళిబొట్టుతో హృదయాన్నే వరుడిగా చేసుకుంటుంది॥ కవిత ఒక మధువు — మాటల మంజీరంలో జారే మకరందమై, చదివిన ప్రతి హృదయంలో చిరునవ్వుల చిలకరింపులు చిమ్ముతుంది॥ కవిత ఒక కూర్పు — అక్షరాలన్నీ అల్లుకొని అందమైన పూలదండగా మారుతుంది, భావాల సోయగాలతో భాషకు వన్నెలద్దుతుంది॥ కవిత ఒక నేర్పు — మనసును మనిషిగా తీర్చిదిద్దే గురువు, మౌనానికి మాట నేర్పి మమతలకు మార్గం చూపుతుంది॥ కవిత ఒక ఆట — ఊహల ఊయలలో ఊగించే ఉల్లాసం, పదాలతో పరవశించి పాఠక హృదయాన్ని పసితనంలోకి తీసుకెళ్తుంది॥ కవిత ఒక పాట — రాగాల రెక్కలపై విహరించే కోయిలగానం, విన్నవారి హృదయవీణపై మధుర స్వరాలను పలికిస్తుంది॥ కవిత ఒక హారం — అక్షర పుష్పాలతో అల్లిన అపూర్వ సరం, కవి హృదయాన్ని అలంకరించి కాలానికీ పరిమళం పంచుతుంది॥ కవిత ఒక ఆభరణం — భాషామాత నుదుటిన మెరిసే తిలకం, తెలుగు తల్లికి తేజస్సై తరతరాలకు వెలుగై నిలుస్తుంది॥ కవిత ఒక ప్రయాణం — కన్నీటి తీరం నుంచి ఆనంద తీరాల దాకా, జీవితపు దారుల్లో జ్ఞాపకాల జ్యోతులు వెలిగిస్తుంది॥ కవిత ఒక ప్రవాహం — గుండెల గర్భం నుంచి ఉబికి వచ్చే గంగలా,...
Image
 సాహితీ సుగంధం అక్షరాల మీద మోజు కలిగింది— ఆత్మను ఆవహించే అమృత బిందువులై, మనసు మట్టిలో మొలకెత్తి మధుర భావాల తోటగా విరబూసింది॥ పుస్తకాల మీద ప్రేమ పుట్టుకొచ్చింది— పుటలు తిరగేస్తుంటే పరిమళాలు వెదజల్లింది, ప్రతి గ్రంథం ఓ గురువై జీవిత సత్యాలు నేర్పింది॥ కవితల మీద మనసు పడింది— పదాల పల్లకిలో ఊరేగే భావాలు హృదయ తంతులను తాకి, నిశ్శబ్దానికే స్వరాల హారతి ఇచ్చింది॥ కవుల మీద ఇష్టం ఏర్పడింది— వారి కలం నుంచి జారిన అక్షరాలు అమృత ధారల్లా అనిపించి, ఊహల ఆకాశంలో మనసు విహరించింది॥ ఫఠనంపై ఆసక్తి పెరిగింది— చదువుతుంటే చైతన్యం చెలరేగింది, ప్రతి వాక్యం కొత్త వెలుగై అజ్ఞాన చీకట్లను పారద్రోలింది॥ సాహిత్యంపై అభిలాష ప్రబలమయ్యింది— అది కేవలం అభిరుచి కాదు, ఆత్మకు ఆహారమై, అనుభూతులకు ఆలంబనమై జీవితానికి జ్యోతిగా నిలిచింది॥ ఇలా— అక్షరం అక్షరంగా ఆరాధన పెరిగింది, పుస్తకం పుస్తకంగా ప్రేమ విస్తరించింది, కవిత కవితగా హృదయం పరవశించింది, సాహిత్య సౌరభంతో జీవితం సుగంధమైంది॥ — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 పుస్తకం కనుమరుగవుతుందా? పుస్తకం మూతబడుతుంది— పుటల పలుకులు మౌనమవుతున్నాయి, అక్షరాల ఆత్మీయతను అరచేతి తెరలు ఆక్రమిస్తున్నాయి॥ పుస్తకం కొనేవాళ్లు తగ్గారు— పుస్తక దుకాణాల గడపలపై గాలిదుమ్మే గుసగుసలాడుతోంది, జ్ఞానదీపాల వెలుగులు నెమ్మదిగా నీరసిస్తున్నాయి॥ పుస్తకం చదివేవారు లేరు— ఒకప్పుడు రాత్రివేళ దీపం కింద పుటలు తిప్పిన వేళ్లు, ఇప్పుడు చరవాణి వెలుగులో మౌనంగా మరుగునపడుతున్నాయి॥ పుస్తకం ప్రచురించే కవులు తగ్గారు— మనసు రక్తంతో రాసిన పద్యాలకు ముద్రణ యంత్రాలు ఎదురుచూస్తున్నాయి, కవిత్వ గర్భగుడిలో నిశ్శబ్దమే నివాసముంటోంది॥ “పుస్తకం హస్తభూషణం” అనేవారు లేరు— ఒకప్పుడు చేతిలో పుస్తకం ఉంటే అది విద్యకు గుర్తు, వినయానికి ప్రతీక, వ్యక్తిత్వానికి వన్నెగా నిలిచేది॥ గ్రంథాలయాల తలుపులు ఇప్పటికీ ఎవరికో ఎదురు చూస్తున్నాయి, అరుదైన పుస్తకాల మధ్య ఒంటరితనం అక్షరాలై తిరుగుతోంది॥ పుస్తకం కనుమరుగవుతుందా? లేదు లేదు - పుటలు పసుపురంగైపోయినా పదాల పరిమళం చావదు, అక్షరాల అస్తమయం జరిగినా ఆలోచనల ఉదయం ఆగదు॥ ఒక మంచి పుస్తకం— మనిషిని మనీషిగా మలుస్తుంది, మూసుకుపోయిన మనసుల తలుపులు తెరుస్తుంది, చీకటి కాలానికీ దీపస్తంభంలా దారి చూపి...
Image
 ముచ్చటగా మూడు గంటలు జరిగిన కాలిఫోర్నియా వీక్షణం 165వ అంతర్జాల సమావేశం  నేడు 16-05-26వ తేదీ శనివారం ఉదయం వీక్షణం 165వ అంతర్జాల సమావేశం ముచ్చటగా మూడు గంటలు జరిగింది. సభ అధ్యక్షురాలు మరియు వీక్షణం వ్యవస్థాపుకురాలు డాక్టర్ కె.గీతా మాధవి స్వీయ పరిచయం చేసుకోబోతున్న కవి గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ మరియు అవధానం అమృతవల్లికి, మరియు కవిసమ్మేళనంలో పాల్గొంటున్న కవులకు, కవయిత్రులకు స్వాగతం పలికారు.  మొదట రాజేంద్ర ప్రసాద్ తన స్వీయ పరిచయాన్ని చేసుకున్నారు. కవిత్వం రాయటానికి ఆంగ్ల కవులు వర్డ్సువర్త్, కీట్స్, షెల్లీ, తెలుగు కవులు శ్రీశ్రీ, దేవులపల్లి క్రిష్ణశాస్త్రి, సినారె, దాశరధి కవితల ప్రభావాన్ని చదివి అందరినీ ఆకట్టుకున్నారు. తర్వాత తన కలియుగ శతకం అముద్రిత పుస్తకంలోని పద్యాలను పఠించారు. తన సుమ సౌరభాలు, తెలుగు సౌరభాలు, కవితా సౌరభాలు, అక్షర సౌరభాలు పుస్తకాల గురించి సమగ్రంగా వివరించారు. నవ కవులకు ఎక్కువగా చదవమని, మనుషులను, ప్రకృతిని గమనించమని, అనుకరణ కాదు - స్వతంత్రతా భావాలు ముఖ్యమని, తెలుగుభాషను ప్రేమించమని, విమర్శలను స్వీకరించి సరిదిద్దుకొమ్మని, నిరంతర సాధనచేయమని సలహా ఇచ్చారు. పిమ్మట క...
Image
 తెరచి చూడు తలుపు తెరచి చూడు — తరలి వచ్చిన అతిథిని, తులసి పరిమళంలా ఆహ్వానించు, మనసారా పలకరించు,  మాటలతో మమతల హారతి ఇవ్వు॥ కళ్ళు తెరచి చూడు — ప్రకృతి సోయగాల్ని దర్శించు, పొద్దుతిరుగుడు నవ్వును చూడు, చుక్కల చీర కట్టిన ఆకాశాన్ని ఆస్వాదించు, ప్రపంచపు అందాలలో పరవశించు॥ జేబు తెరచి చూడు — దరిద్రుని కన్నీటి తుడువు, ఆకలికి అన్నమై మారు, చేతి దానం అందించు, జీవితం జయగానం పాడుతుందని చాటు॥ పుస్తకం తెరచి చూడు — కవి హృదయం తెలుసుకొను, అక్షరాల ఆవేదన ఆలకించు, పదాల పరిమళంలో తేలు, భావాల భువిలో విహరించు॥ హృదయం తెరచి చూడు — ప్రేమానురాగాలు పంచు, క్షమను కౌగిలించుకొను, మనుషుల మధ్య మమతల వంతెన కట్టు, స్నేహ సుధలను జలజలా కురిపించు॥ కలం తెరచి చూడు - అక్షర చినుకులు రాల్పించు, పద పంక్తులు పారించు, భావాలు బయటపెట్టు; పాఠకుల హృదయాలు దోచుకొను॥ తెరవడం నేర్చుకున్న జీవితం — తేజోమయమై వెలుగుతుందని గ్రహించు, మూసుకుపోయిన మనసుకన్నా తెరచిన హృదయమే జగతికి నిజమైన స్వర్గద్వారమని చాటి చెప్పు॥ ✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 నవరసాల నవచైతన్యం వెన్నెల వీణలు మీటగా విరహమే వసంతమౌతుంది, చూపుల చినుకులు జారగా శృంగారం జయగీతమౌతుంది॥ చిరునవ్వు చిందినంతనే చీకటి చెదిరిపోతుంది, ముచ్చట్ల మధురిమలో హాస్యం హరివిల్లౌతుంది॥ కన్నీటి తడి పలుకుల్లో కరుణ కల్పవల్లౌతుంది, పరబాధ పంచిన హృదయం మానవత్వ దీపమౌతుంది॥ అన్యాయ చీకట్ల మధ్య అగ్నిశిఖలా కోపం లేస్తుంది, ధర్మరక్షణ దిక్సూచిగా రౌద్రం రణభేరియౌతుంది॥ పర్వతమై కష్టం వచ్చినా పడిపోని ధైర్యమే వీరత్వమౌతుంది, పరాజయ బూడిదలోనూ పరాక్రమ జ్యోతి వెలుగౌతుంది॥ చీకటి గాలి చప్పుడు కూడా చిత్తాన్ని కంపింపజేస్తుంది, జాగ్రత్త నేర్పే గురువై భయానకం దీపమౌతుంది॥ కపటపు కలుషం చూసి మనసు కలవరపడుతుంది, మలినాలను దహింపజేసే బీభత్సం బోధనౌతుంది॥ అణువులో విశ్వం చూసే ఆశ్చర్యమే అద్భుతమౌతుంది, పసినవ్వు పరిమళంలో ఆనందదీపం వెలుగౌతుంది॥ అలజడి అలలు ఆగగా ఆత్మసరోవరం నిర్మలమౌతుంది, నిశ్శబ్ద నాదాల మధ్య శాంతం శశిధారౌతుంది॥ నవరసాల నవనీతంతో నరజీవితం నాట్యమాడుతుంది, సుఖదుఃఖ రాగాల నడుమ నవోన్మేషం జీవనకావ్యమౌతుంది॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 కవితా మంజరి  అద్భుత కవిత— అక్షరాల ఆకాశంలో అరుణోదయమై ఉదయిస్తుంది, మనసు మబ్బుల్ని తొలగించి మధుర వెలుగులు చల్లుతుంది॥ అపూర్వ కవిత— అనుభూతుల అలలపై తేలుతూ ఆత్మను ఆవహిస్తుంది, చదివిన ప్రతి హృదయంలో చిరునవ్వుల దీపం వెలిగిస్తుంది॥ అందాల కవిత— అలరుల పరిమళమై పరుచుకుని పలుకుల పల్లకిలో విహరిస్తుంది, చంద్రబింబపు చల్లదనంలా చిత్తాన్ని చిలిపిగా తాకుతుంది॥ ఆనంద కవిత— ఆత్మీయతల అమృతధారగా అంతరంగాల్లో జాలువారుతుంది, బాధల బండరాళ్లను కరిగించి బంగారు భావాల్ని మొలిపిస్తుంది॥ చక్కని కవిత— చినుకుల చప్పుడు లాగా చెవులకు చెలిమై చేరుతుంది, మంచు తాకిడిలా మృదువుగా మనసును ముద్దాడుతుంది॥ మంచి కవిత— మానవత్వపు మకరందమై మట్టిమనుషుల్ని మమతతో కడుతుంది, చీకటి దారుల్లోనూ చిగురుటాకుల ఆశను నాటుతుంది॥ లయాత్మక కవిత— గాలిలో తేలే గీతంలా గుండెల తంత్రులను మీటుతుంది, అక్షరాల అడుగులకు అందమైన నృత్యాన్ని నేర్పిస్తుంది॥ భావాత్మక కవిత— బ్రతుకు బాటల బంధాలను భావాల బంగారు దారాలతో కుట్టుతుంది, కన్నీటి చుక్కలోనూ కాంతుల కలలను చూపిస్తుంది॥ కవిత అంటే— కేవలం పదాల పొదరిల్లు కాదు, ప్రాణాల ప్రవాహం, మనసుల మధ్య మమతా సేతువు, మానవత్వాన్ని మధురంగా మ...
Image
 పుష్పాంగనల పరిమళయానం కుముదిని దగ్గరకు కులుకుకుంటూ వెళ్తా— కుసుమాల గాలిలో కలల్ని కదిలిస్తా, వెన్నెల వెచ్చదనమై వెన్నంటే నిలుస్తా, విరిసిన నవ్వుల్లో విరహాల్ని మరిపిస్తా॥ చామంతి చెంతకు చకచకా పోతా— చామరపు చల్లదనమై చుట్టూ తిరుగుతా, చూపుల చినుకులతో చెలిమిని చిందిస్తా; చిరునవ్వుల చాటున చిలిపితనమై వెలుగుతా॥ లతాంగి వద్దకు లగెత్తుకుంటూ చేరతా— లయల అలలై లాలనగా పలుకుతా, ఆమె అడుగుల నడకలో నాట్యం చూపిస్తా, ఆత్మవీణ తంతుల్ని ఆలాపనగా మీటుతా॥ మాలతి మాటుకు మెల్లగా సమీపిస్తా— మల్లెల పరిమళమై మనసంతా నింపుతా, నిశీథి రేయిలో నీలిమవెలుగై వెలుగుతా, నెమ్మదిగా ప్రేమగీతం పులకరించేలా పాడుతా॥ పుష్పలత ప్రక్కజేరి పకపకా నవ్విస్తా— పూలరేఖలపై పొంగే హాస్యమై విరుస్తా, గులాబీ గుండెల్లో కమ్మని గీతమౌతా, గుబాళింపుల గాలిలో గుసగుసలై తేలుతా॥ కుసుమ సరసకు కవ్విస్తూ కదులుతా— కోయిల కూతల్లో కోరికల్ని దాచుతా, వెలుగుల వాకిట్లో వెన్నెలై నిలుస్తా, వీణారాగాల వలపును వేళ్లతో అల్లుతా॥ కమలాక్షి సన్నిధికి తడుముకుంటూ చేరతా— కలువకన్నుల్లో కాంతుల్ని నింపుతా, ఆమె పలుకుల్లో పరవశం పూయిస్తా, ఆత్మను అర్పించే ఆరాధనగా మారుతా॥ ఇలా ప్రతి పుష్పసుందరి పయనంల...
Image
 గౌరవ కుటుంబికులారా! కుటుంబం అంటే— కేవలం నాలుగు గోడల మధ్య జీవనం కాదని తెలుసుకోండి, నాలుగు హృదయాలు ఒకే స్పందనగా కొట్టుకునే స్నేహసౌధంగా భావించండి॥ ఒకటిగా ఉండండి— వాన గాలులెన్ని విరుచుకుపడ్డా వేర్లు విడనాడని వృక్షంలా నిలబడండి, విపత్తులు ఎన్ని ఎదురైనా  విడిపోని వెలుగులా నిలవండి॥ ఒకేతాటిపై నడవండి— అడుగులు వేరైనా ఆశయాలు ఒక్కటై సాగండి, మాటలు భిన్నమైనా  మనసులు కలిసే మార్గమై ఉండండి॥ ఒకేమాటపై నిలబడండి— నమ్మకం అనే నిటారుదీపాన్ని ఎప్పటికీ ఆరనీయకండి,  అపార్థాల మబ్బులొచ్చినా  ఆప్యాయతను సూర్యునిలా వెలిగించండి॥ “మేము అంతా ఒకటే” అని చాటండి— అన్నదమ్ముల అనుబంధంలో, అక్కచెల్లెళ్ల ఆప్యాయతలో, తల్లిదండ్రుల త్యాగాల్లో ప్రేమ పరిమళం పంచండి॥ ఒకరికొకరమని నిరూపించండి— కష్టాల్లో చేయూతగా నిలబడి, కన్నీళ్లలో ఓదార్పుగా మారి, సంతోషాల్లో నవ్వుల హారతిగా సహచరులై సాగండి॥ ఒకటే ఆశయం పెట్టుకోండి— “మన కుటుంబ సంతోషమే మా సంపద” అనే మహామంత్రం జపించండి, అనురాగాల అమృతవర్షం కురిపించండి॥ కుటుంబం కలిసుంటే— చిన్న ఇల్లు కూడా స్వర్గమవుతుందని చెప్పండి, మనసులు కలిసుంటే— చిన్న జీవితం కూడా మహాకావ్యమవుతుందని తెలపండి॥ కుటు...
Image
 ఓ కవీశ్వరా! కుళ్ళును కడిగేయ్— కంపు కాయాల్ని కాల్చివేయ్, కపటపు కవచాల్ని ఛేదించేయ్, కలుషిత మనసులను శుద్ధిచేయ్॥ చెడును చెరిపేయ్— చీకటి చాటున దాగిన దుర్బుద్ధిని, చెరగని మచ్చలై పెరిగిన పాపాన్ని, చైతన్య జ్వాలలతో చిదిమివేయ్॥ మలినాన్ని మట్టుబెట్టేయ్— మనసుల్లో పేరుకున్న మసకలను, మాటల్లో మొలిచిన మోసపు ముళ్లను మానవత్వ వర్షంతో ముంచెత్తేయ్॥ అవినీతిని అంతంచేయ్— అధికారపు అహంకార జ్వాలలను, అన్యాయపు అడ్డగోలు దారులను అక్షర సత్యంతో అణచివేయ్॥ అహంకారాన్నీ అణగకొట్టేయ్— అధికత్వపు అంధకార గర్జనలను, అణగారిన వారి ఆర్తనాదాలపై సమానత్వ అమృతం చల్లివేయ్॥ దౌర్జన్యాలను తుదముట్టించేయ్— దుర్మార్గపు దండయాత్రలన్నిటినీ, దీనుల కన్నీటి గాథలన్నిటినీ, ధర్మధ్వజంతో ధూళిలో కలిపివేయ్॥ మానవత్వమే మంత్రంగా మారనీ, మమతలే మహోన్నత మార్గమవనీ, నిజాయితీనే నిత్యదీపమై వెలగనీ, నూతన సమాజం నవోదయమై విరియనీ॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 అమ్మ అమృతస్వరూపిణి అమ్మ అనగానే— అక్షరాలకు ప్రాణం వస్తుంది, మాటలకు మాధుర్యం చేరుతుంది, మనసులకును మమకారం అంటుకుంటుంది॥ పసిబిడ్డ పలుకులలో— అమ్మనే ప్రథమ స్వరం, పదం పలకకముందే ప్రేమను పంచే దైవం॥ నిద్రలేని రాత్రుల్లో— నెత్తిన వేళ్ళతో వెన్నెల వెదజల్లే శివశేఖరం, కన్నీటి చినుకుల్లో— కన్నుల్ని తుడిచే కరుణాసాగర తరంగం॥ తన కడుపు నొప్పులను దాచుకుని— ఇంటినిండా నవ్వులను వెలిగించే దీపం, తన ఆశలను అర్పించి— కుటుంబ ఆశయాలను నెరవేర్చే అంకురం॥ ఆమె చేతుల్లోనే— జీవితపు మొదటి అక్షరాభ్యాసం, ఆమె చూపుల్లోనే— ప్రపంచమంతా పరిమళించే సౌందర్యం॥ అమ్మ ఒక మాట కాదు— అద్భుతమైన ఒక మంత్రం… ఆమె ఒక మనిషి కాదు— అమూల్యమైన ఒక సత్త్వం॥ మాతృదినోత్సవం ఒక రోజే కాదు— ప్రతి రోజు ఆమె పాదాల పూజే కావాలి, ప్రతి శ్వాసలో ఆమె స్మరణే ఉండాలి, ప్రతి విజయానికి ఆమె కేంద్రం కావాలి॥ అమ్మ ఉంటే ఈ ప్రపంచం ఒక స్వర్గం, తల్లి నవ్వుతుంటే ఆ ఇల్లు ఓ ఆనందనిలయం॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 కవిత్వ వైభవాలు వింత విరి కవిత్వం — విరహానికీ వెన్నెలరంగు పూయిస్తుంది, మౌనపు మడుల్లో మెల్లగా మొలిచి మనసుకు మధురానుభూతి పంచుతుంది॥ విడ్డూర విభావము కవిత్వం— కన్నీటిలోనూ కాంతులు వెతుకుతుంది, గాయాల గర్భంలో గానమై పుట్టి బాధలనైనా బంగారమై మార్చుతుంది॥ విశిష్ట వెలుగు కవిత్వం— అక్షరాలకు ఆత్మరూపం ఇస్తుంది, పలుకుల పుష్పాల్లో పరిమళమై నిలిచి పాఠక హృదయాల్లో పావనమవుతుంది॥ విశేష వైభవము కవిత్వం— కాలాన్నికూడా కట్టిపడేస్తుంది, ఒక చిన్న పాదంలోనే విశ్వాన్నంతా ఊహలతో ఊయలలూపిస్తుంది॥ విన్నూతన వికాసము కవిత్వం— ప్రతి భావానికి కొత్త బాట వేస్తుంది, నిశ్శబ్దానికీ స్వరమై నిలిచి నిత్యనూతన సత్యాలను పలికిస్తుంది॥ విస్మయ విజృంభణ కవిత్వం— చుక్కలతో చీర అల్లినట్లుంటుంది, అక్షరాల ఆకాశంలో ఆత్మను ఎగరేసి అనంతానందాల్ని అందిస్తుంది॥ విచిత్ర విభాతము కవిత్వం— నవ్వుల్లోనూ నిశ్వాసాల్లోనూ నడుస్తుంది, కలలకీ కన్నీళ్లకీ కలయికై జీవితాన్ని జాజివనమై మార్చుతుంది॥ వైశేషిక వెలివరింత  కవిత్వం— వాక్యాల్లో విలువలను నాటుతుంది, మానవ హృదయాల మధ్య మమతల మంగళసేతువై నిలిచిపోతుంది॥ అందుకే కవిత్వమంటే— వింత విశ్వవీణగానం, విశేషాల వెలుగుల్లో విస్మయ...
Image
 వేసంగి వ్యధలు మండుటెండలు మంటలు రేపగా— గ్రీష్మ ఋతువు గగనమంతా గర్జిస్తోంది, మేమాస వడగాల్పులు వీస్తుంటే వేడి గాలులు వీధుల్ని వణికిస్తున్నాయి॥ ఉక్కపోతలు ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, చెమట చుక్కలు శ్రమల సాక్ష్యాలై జారుతున్నాయి, ఎండిన చెరువులు నిశ్శబ్దంగా నిలిచిపోతుంటే ప్రవహించని నదులు వేదనను వెల్లబోస్తున్నాయి॥ తడిలేని నాలుకలు తపనగా వణుకుతుంటే, దప్పికైన గొంతులు నీటి కోసం మొరపెడుతున్నాయి, కొట్టుకుంటున్న గుండెలు వేడిని తట్టుకోలేకపోతుంటే కూలిపోతున్న దేహాలు నీడ కోసం పరుగెడుతున్నాయి॥ వేసంగి వదలని వేదనగా వెంటాడుతుంది, నీడకై పరుగులు తీయిస్తుంది, నీటికై ముచ్చెమటలు పట్టిస్తుంది, కదలకుండా గృహాల్లో బంధిస్తుంది॥ ఇదే గ్రీష్మ తాపము— జీవితాన్ని జ్వాలలతో పరీక్షించే కాలము, ఇదే సూర్య ప్రతాపము— ప్రకృతిశక్తి పరాక్రమం చూపించే ఉగ్ర రూపము॥ చినుకులు చిందించే మేఘాల కోసం ఎదురుచూపులు, చల్లని గాలుల స్పర్శకై తపిస్తున్న ప్రాణాలు॥ గ్రీష్మాగ్ని గుండెల్ని గాయపరిచినా— వానకాలం వస్తుందనే ఆశే జీవనానికి ఊపిరై నిలుస్తోంది॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 పట్టుల ప్రస్థానం పట్టు పట్టా— పదాల పసిడి తీగల్ని పలికించా, భావాల బుట్టలో బంగారు వెలుగులు నింపా॥ గుట్టు పట్టా— గుండెల లోతుల్లో గూడు కట్టిన రహస్యాల్ని గాలికి గుసగుసలుగా చెప్పించా॥ మట్టు పెట్టా— మాటల మేడల్లో మలినాల్ని మరుగునపెట్టా, మానవత్వం మొలకెత్తే నేలను సిద్ధం చేసా॥ తూటా పట్టా— అవినీతిపరుల ఆట కట్టించా, సత్యం తాకే చోటే లక్ష్యమయ్యా॥ బాట పట్టా— బాటసారిగా భావాల మార్గం ఎంచా, బంధాల దారుల్లో వెలుగులు విరజిమ్మా॥ మాట పట్టా— మాటలో మాధుర్యం మిగిలేలా చూసా, మానసాల్ని ముద్దాడే మంత్రమై నిలిచా॥ చేయి పట్టా— చేయి పట్టి చీకట్లను దాటించా, చెలిమి చిగురించే చెట్లు నాటా॥ కాలు పట్టా— కాలానికి కట్టుబడి ముందడుగు వేసా, కల్పనలకు కంచె దాటే ధైర్యం ఇచ్చా॥ గొంతు పట్టా— గుండె గుసగుసల్ని గానం చేసా, గాత్రంలో గాఢతను నింపా॥ చెవి పట్టా— చిన్న చప్పుళ్లను కూడా వినిపించా, చెదిరిన మనసుల్ని చక్కబెట్టా॥ జుట్టు పట్టా— జీవిత గాలిలో ఎగిరే తంతుల్ని సర్దా, జీవన జాలాన్ని జాగ్రత్తగా అల్లా॥ మెడ పట్టా— మెడలో మోసే బాధల్ని తగ్గించా, మెత్తని మమతతో మోసే శక్తినిచ్చా॥ చొక్కా పట్టా— చిన్న చినుకుల్లా జారే క్షణాల్ని దాచా, చిరునవ్వుల చొక్కాలో...
Image
 రూపాల రాగమాలిక చుక్కల్లో చంద్రుడా— చీకటి చీరపై వెండిబొట్టువా, నిశ్శబ్ద రాత్రికి చిరు నవ్వువా, నిదురలేని హృదయాలను తాకే కలవా॥ కొమ్మల్లో పుష్పమా— కాంతికుసుమంగా కదిలే కవిత్వానివా, పచ్చని శ్వాసలో పరిమళం నింపే ప్రాణానివా, సున్నితమైన స్పర్శలో సౌందర్యం పలికించే గీతానివా॥ చీకట్లో దీపమా— దారి తప్పిన అడుగులకు దిక్సూచివా, ఆశల అంచుల్లో అగ్నిజ్యోతి వెలిగించే దీక్షవా, నిస్సహాయ క్షణాల్లో నిలబెట్టే నమ్మకానివా॥ ఆకాశంలో హరివిల్లా— ఏడు రంగుల్లో ఎదను ఎగిరించే చిత్రానివా, వర్షపు కన్నీళ్లలో వెలిగే విచిత్రానివా, ప్రకృతి పలికే పరమానంద గేయానివా॥ కడలిలో కెరటమా— అంతర్లీన ఆవేదనల ఆగలేని అలజడివా, తీరాన్ని తాకే తపనలో తడిసిన తపస్సువా, అలల లయలో ఆత్మగీతం ఆలపించే నాదానివా॥ మాటల్లో మాధుర్యమా— మనసు ముట్టే మధురిమల మాలికవా, పలుకుల పొదిలో పండే ప్రేమపండువా, ఒక్క అక్షరంలో ఒదిగిన అనంతానందానివా॥ నీవు— చుక్కల్లో చంద్రుడువైనా, కొమ్మల్లో పుష్పానివైనా, చీకట్లో దీపానివైనా, నా కవిత్వంలో నీవే పరిమళమై నిలుస్తావు, నా హృదయంలో నీవే నిత్య గీతమై పలుకుతావు॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 పాడరా… పాడరా… (గానవిహారం)  పాడరా… పాడరా… పిల్లలపాట పాడరా, పలుకుల పరిమళాలు చిమ్మరా, నవ్వుల చినుకులు చల్లరా, నెమలి నాట్యాలు చేయించరా॥ || పాడరా… || పాడరా… పువ్వులపాట పాడరా, పొంగుల సందడి పంచరా, రంగుల రాగాల రేపరా, రమణీయ లోకాలు చూపరా॥ || పాడరా… || పాడరా… పల్లెలపాట పాడరా, పంటపొలాల పలుకులు జార్చరా, గాలి గుసగుసల్లో గీతం కలపరా, గడ్డి గులకరాళ్ళ గానం వినిపించరా॥ || పాడరా… || పాడరా… ప్రేమపాట పాడరా, హృదయ తంతుల్ని తాకరా, నిశ్శబ్ద రాగాల నడుమ సాగరా, నిత్యానురాగం నింపరా॥ || పాడరా… || పాడరా… పెళ్లాంపాట పాడరా, పెదవులపై నవ్వులు పూయించరా, ఇంటి దీపంగా వెలిగించరా, ఇష్టాల హారంగా చుట్టరా॥ || పాడరా… || పాడరా… పడుచులపాట పాడరా, పగటి కలలను పలికించరా, యువ హృదయాల ఊయల ఊగించరా, యుగయుగాల్ని ఉత్తేజపరచరా॥ || పాడరా… || పాడరా… ప్రకృతిపాట పాడరా, పొంకాల ప్రొద్దు పొడిపించరా, భావాల బాటలో పయనించరా, భువినంతా ఆనందింపజేయరా॥ || పాడరా… పాడరా… || గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
సాహిత్యప్రవాహాలు ఆలోచనలు ప్రవహిస్తున్నాయి— మనసు మడుల్ని మెల్లగా తడుపుతూ, నిశ్శబ్దపు నేలలో సేద్యం చేస్తూ నూతన భావాల్ని మొలిపిస్తూ॥ అక్షరాలు ప్రవహిస్తున్నాయి— కలమునుండి కాంతులై జారిపడుతూ, మాటలుగా మారుతూ మనసుల మధ్య వంతెనలవుతూ॥ కవితలు ప్రవహిస్తున్నాయి— హృదయ తంతుల్ని హత్తుకుంటూ, భావ బిందువులను కారుస్తూ అనంత సముద్రమై విస్తరిస్తూ॥ ప్రశంసలు ప్రవహిస్తున్నాయి— పలుకుల పూలై పరిమళిస్తూ, కవి హృదయంలో తృప్తి నింపుతూ మరో కవితకు కిరణమవుతూ॥ సాహితీ నదులు ప్రవహిస్తున్నాయి— తీరాల్ని తాకుతూ, రాళ్లను రాసుకుంటూ గమ్యాన్ని చేరాలని తపిస్తూ॥ కవన కాంతులు ప్రవహిస్తున్నాయి— చీకట్ల గూటిని చీల్చుకుంటూ, జీవితం వైపు అడుగులేస్తూ కొత్త దారిని చూపిస్తూ॥ ప్రవాహమంటే— ఆగని ఆత్మయాత్ర, ప్రతి చలనం ఒక సృష్టి, ప్రతి ప్రవాహం ఒక కొత్త జీవితం॥ — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 జీవితభారాలు వంటిభారం మోస్తున్నప్పుడు— కాళ్ళు ముందుకు పడనంటవి కరాలు కదలనంటవి కానీ నోరు మొత్తుకుంటది॥ ఇంటిభారం నెత్తికెక్కినప్పుడు— ఇల్లు ఇటుకలకే పరిమితం కాదు, బాధ్యతల బరువులతో బంధాల బలం బిగుచుకుంటుంది॥ పనిభారం పైనబడినప్పుడు— పగలు రాత్రి కలిసిపోతాయి, చెమట చుక్కలౌ రాలుతున్నా శరీరం శ్రమను కొనసాగించమంటుంది॥ దూరాభారం దాటుతున్నప్పుడు— దూరాలు గుండెల్లో దిగబడతాయి, అంతరాల ఆవేదనలోనే ఆప్యాయతల విలువ పెరుగుతుంది॥ తలమీదిభారం మోస్తున్నప్పుడు— అడుగులు నెమ్మదిగా వేయమంటాయి, కానీ ధైర్యం దారి చూపుతూ మనసుకు ఊపిరినిస్తుంది॥ పిల్లలభారం మోస్తున్నప్పుడు— బాధ్యతల బరువు తేలికవుతుంది, చిరునవ్వుల చిన్నారుల మధ్య జీవితం పరవశిస్తుంది॥ పెద్దలభారం మోస్తున్నప్పుడు— అనుభవాల నీడ మనతో ఉంటుంది, వారి ఆశీస్సుల వెలుగులో మంచి మార్గం కనబడుతుంది॥ అప్పులభారం మోస్తున్నప్పుడు— మనసు కొంచెం వంగిపోతూనే ఉంటుంది, కానీ ఆశల అంచుల్లో అవకాశాలు కొత్తగా మొలుస్తాయి॥ జీవితభారం మోస్తున్నప్పుడు— జీవితం బాట చూపిస్తుంది, బరువు అనిపించే ప్రతి క్షణం భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దుతుంది॥ భారం అనేది శాపం కాదు— బాధ్యతల రూపంలో వచ్చిన వరం; మోసిన కొద్దీ...