కవనప్రారబ్దాలు


ఊహలు

ఉడికిస్తున్నాయి


భావాలు

బంధిస్తున్నాయి


విషయాలు

వెంటబడితరుముతున్నాయి


అక్షరాలు

అరదండాలేస్తునాయి


పదాలు

పట్టేసుకుంటున్నాయి


పంక్తులు

సంకెళ్ళువేస్తున్నాయి


కలాలు

కట్టిపడవేస్తున్నాయి


కాగితాలు

కునుకుతీయనీయకున్నాయి


వ్రాతలు

వరదలైపారుతున్నాయి


మనసు

మత్తులోతూలుతుంది


కవితలు

కూర్చోబెట్టికూర్పిస్తున్నాయి


కవనాలు

కైతాభిమానులనుముంచేస్తున్నాయి


కయితలను క్రోలండి

కవులను తలచండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog