ఆసక్తికరంగా సాగిన వీక్షణం 162వ అంతర్జాల సమావేశం
నేడు ఉదయం 162వ కాలిఫోర్నీయా వీక్షణం గవాక్షం అంతర్జాల సాహితీ సమావేశం మరియు కవిసమ్మేళనం అత్యంత ఆసక్తికరంగా సాగింది. మొదట
వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి నేటి ప్రధాన వక్త ప్రముఖ కవి సాహితీవేత్త మరియు అధ్యక్షుడు డాక్టర్ వి.డి.రాజగోపాల్ గారిని సభకు పరిచయంచేసి 'నేటి కవిత్వం - సామాజీ స్పృహ ' అనే అంశంపై ప్రసంగించవలసినదిగా ఆహ్వానించారు. డాక్టర్ రాజగోపాల్ గారు షుమారు 40 నిమిషాలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తూ గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, శ్రీశ్రీ, దాశరధి క్రిష్ణమాచార్య మొదలగు కవుల గురించి విపులంగా తెలియపరచి వారు తెలుగు భాషకు చేసిన సేవలు గురించి తెలియజేశారు. వారి ప్రసంగం కవులను ఆకట్టుకుంది. రాజగోపాల్ గారి ప్రసంగం చక్కగా సాగిందని గీతా మాధవి గారు, కవులు కొత్తూర్ వెంకట్, చీదెళ్ళ సీతాలక్ష్మి, అయ్యల సోమయాజుల ప్రసాద్, లలితా చండి, గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. పిమ్మట అమెరికా యువకవి ఇంగువ శశి గారు వ్రాసిన ' లవ్ , దేశం, జిందగి ' అనే పేరుతో త్రిభాష కవితల సంపుటిని గీతా మాధవి గారు ఆవిష్కరించారు. కంప్యూటర్ ఉద్యోగం చేస్తున్న మంచి కవితలు వాసి ప్రచురించినందుకు అభినందనలు తెలిపారు. తన పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రోత్సహిస్తున్నందుకు శశి ధన్యవాదాలు తెలిపారు.
తర్వాత గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, డాక్టర్ రాధా కుసుమ ఆధ్వర్యంలో కవిసమ్మేళనం జరిగింది. మొదట గీతా మాధవి గారు 'అమ్మ అలిగిన వేళ" అనే కవితను పిల్లల భావాలు వెల్లబుచ్చుతూ చదివి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. బిటవరం శ్రీమన్నారాయణ 'సరళ నీతి ' కవితను, పరిమి వంకట సత్యమూర్తి ' ఇల వెలిసిన కలియుగ దైవం సత్యసాయి బాబా ' కవితను, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ 'మాతృత్వాన్ని -మరిచావెందుకు ' కవితను, కొత్తూరు వెంకట్ 'తొలితరపు భారతి, ప్రధమ ప్రవాసి ' కవితను, ఇంగువ శశి 'దేశం' కవితను, ఆనం ఆశ్రితారెడ్డి 'అసలు దేనికీ ఆలోచనలు కవితను ', వుండవల్లి సుజాతమూర్తి 'అవినీతిపై అక్షర పోరాటం' కవితను, బత్తిన గీతాకుమారి 'మనసు లోగిలిలో పీఠమేద్దామా ' కవితను, ఘంటా మనోహరరెడ్డి 'త్గెలుగుతేజం' కవితను, రామక్రిష్ణ చంద్రమౌళి ' వంకాయ ' కవితను, శోభ దేశపాండె 'తెలుగు ' కవితను, మోటూరి నారాయణరావు ' శివనామ స్వర్మరణం - కైవల్యం' కవితను, లలితా చండి 'ఊపిరికోసం ' కవితను, అవధానం అమృతవల్లి 'పెను సవాలు ' కవితను, కోదాటి అరుణ 'తెలుగు భాష ' కవితను, డాక్టర్ సీతాలక్ష్మి ' ఒక క్షణం ' కవితను, భోగెల ఉమామహేశ్వరరావు 'తెలుగు భాష ' కవితను, డాక్టర్ బృందా 'తీయని తోరణాలు ' కవితను, ఉప్పలపాటి వెంకటరత్నం 'తెరిచిన కిటికీ ' కవితను, అరవా రవీంద్రబాబు ఒక కవితను, రాజగోపాల్ వ్రాసిన దేశభక్తి గజల్ పాట 'మువ్వన్నెల జండా ' పాటను, బలుసాని వనజ 'తెలుగు ' పై పాటను, కందుకూరి శ్రీరాములు 'అక్షర బ్రహ్మలం' కవితను, బుక్కపట్నం రమాదేవి 'మానవత్వం' కవితను, చిట్టాబత్తిన వీర రాఘవులు 'తెలుగు భాష ' కవితను, పరాంకుశం కృష్ణవేణి 'సంసిద్ధత ' కవితను వినిపించి శ్రోతలను అలరించారు. పిమ్మట డాక్టర్ రాధా కుసుమ 'వృక్షం' అనే కవితను బహు చక్కగా చదివారు. చివరగా వీక్షణం భారతీయ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ 'మాతృభాష ముచ్చట్లు ' అనే కవితను భావోద్వేగంగా అందరినీ ఆకర్షించేలా పాడి కవితా ప్రియులను ఆకట్టుకున్నారు.
డాక్టర్ గీతా మాధవి ప్రధాన వక్త రాజ గోపాల్ ప్రసంగం బాగుందని. కవులు అందరూ మంచి కవితలు చదివి సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపి సమావేశాన్ని ముగించారు. చక్కని కార్యక్రమం నిర్వహించినందుకు కవులు తృప్తిని వ్యక్తపరిచారు, వచ్చేనెల సమావేశం కొరకు ఎదురుచూస్తుంటామని చెప్పారు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, వీక్షణం భారతదేశ ప్రతినిధి.
Comments
Post a Comment