ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన వీక్షణం 163వ అంతర్జాల కవిసమ్మేళనం

***************************************************


నేడు 21-03-26వ తేదీ శనివారం ఉదయం అంతర్జాలంలో జరిగిన మూడు గంటల 163వ కాలిఫోర్నియా వీక్షణం గవాక్షం అంతర్జాల కవిసమ్మేళనం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. మొదట వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి కవిసమ్మేళనం నిర్వాహకులు మధు ప్రఖ్యా మరియు గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గార్లకు మరియు సమావేశంలో పాల్గొంటున్న కవులకు స్వాగతం పలికారు, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత 163 నెలల నుండి నిరాటంకంగా జరుపుతున్న వీక్షణం సంస్థ కవులకు ప్రోత్సహించాటానికి చేబడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. సమావేశంలో ప్రఖ్యాత కవులు, యువకవులు పాల్గొని విజయవంతం చేస్తున్నారని చెప్పారు. ప్రముఖ కవి మధుబాబు ప్రఖ్యా కవిత్వం గురించి మాట్లాడారు. గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ వీక్షణం నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వర్తించటం ఒక భాగ్యంగా, ఒక గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. కవిసమ్మేళనం అధ్యక్షులు మధు ప్రఖ్యా  మాట్ల్లడుతూ కవి ఒక ఋషి, సుఖదుఃఖాలను నలుగురితో పంచుకునేవాడు అని చెప్పారు. కవిత్వం ఒక శక్తి అన్నారు.


పిమ్మట మధు ప్రఖ్యా, రాజేంద్రప్రసాద్ గార్లు సంయుక్తంగా కవిసమ్మేళనం నిర్వహించారు.  మొదట రామాయణం ప్రసాదరావు 'వ్రణాలతో రణం' అనే కవితను, లింగుంట్ల వెంకటేశ్వర్లు 'చైతన్య గీతం', నాళేశ్వరం శంకరం 'సాగు' అనే సేద్యంపై కవితను, కందుకూరి శ్రీరాములు ఉగాది వృక్షం కవితను, గణేష్ పత్రిక సంపాదకుడు కొత్తూరు సత్యనారాయణ గుప్త 'వీక్షణం సాహితీ గవాక్షం' అనే వీక్షణంపై కవితను, కొత్తూరు వెంకట్ మత్తకోకిల పద్యాలు, శారద 'అవధానం' పై భావకవిత, ప్రశాంతిరాం 'ఉగాది' పై పద్యాలు, వంశీకృష్ణ 'సాగరమధనం' కవితను, యువ కవి ఆది మోపిదేవి 'నాలోని అమ్మ అత్త ఎప్పుడు అయ్యింది ' అనే కవితను, డాక్టర్ గీతా మాధవి 'శాంతి విలువ ' అనే కవితను , తాటిపర్తి బాలకృష్ణారెడ్డి 'అద్దమే నా నిజమైన శతృవు ' అనే కవితను, మధు ప్రఖ్యా 'కట్టె ' పై అద్భుత కవితను, ఘంటా మనోహరరెడ్డి 'అంతరంగ శుద్ద్ధి ' అనే కవితను, సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ 'అటువైపు కూడా చూడు ' అనే ప్రశ్నలు సంధిస్తూ కవితను, శశి ఇంగువ 'మెలాంకలీ' అనే పాటను, అయ్యల సోమయాజుల ప్రసాద్ 'ఉగాదికి స్వాగతం' అనే కవితను వినిపంచారు.  


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, వీక్షణం భారతీయ ప్రతినిధి.కృష్ణ 'సాగరమధనం' కవితను, యువ కవి ఆది మోపిదేవి 'నాలోని అమ్మ అత్త ఎప్పుడు అయ్యింది' అనే కవితను, డాక్టర్ గీతా మాధవి 'శాంతి విలువ' అనే కవితను , తాటిపర్తి బాలకృష్ణారెడ్డి 'అద్దమే నా నిజమైన శతృవు' అనే కవితను, మధు ప్రఖ్యా 'కట్టె' పై అద్భుత కవితను, ఘంటా మనోహరరెడ్డి 'అంతరంగ శుద్ద్ధి' అనే కవితను, సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ 'అటువైపు కూడా చూడు' అనే ప్రశ్నలు సంధిస్తూ కవితను, శశి ఇంగువ 'మెలాంకలీ' అనే పాటను, అయ్యల సోమయాజుల ప్రసాద్ 'ఉగాదికి స్వాగతం' అనే కవితను వినిపించి అందరినీ అలరించారు.


కోదాటి అరుణ 'గతం ఒక ఙ్ఞాపకం' అనె కవితను, భవాని ముప్పాళ్ళ 'స్వాగతగీతం', వైరాగ్యం ప్రభాకర్ 'మార్పుకు సంకేతం' అనే ఉగాది పై కవితను, డాక్టర్ దేవులపల్లి పద్మజ 'పరాభవ ఉగాది' పై పద్యాలు, డాక్టర్ దీపక్ న్యాతి 'నామాలు పరిమాణాలు' అనే తెలుగు ఉగాది పేర్లపై కవితను, భోగెల ఉమామహేశ్వరరావు 'ఉగాది' కవితను, పరిమి వెంకట సత్యమూర్తి 'కెరటాలే నా ఆదర్శం' అనే కవితను, శోభ దేశ పాండె 'ఉగాది' కవితను, లలిత చండి రుబాయిని, డాక్టర్ అవధానం అమృతవల్లి 'ఉషోదయాల సమీరమై' అనే ఉగాది కవితను, బుక్కపట్నం రమాదేవి 'అందని ద్రాక్షలు' అనే కవితను, బిటవరం శ్రీమన్నారాయణ 'మానవ వైఖరి' కవితను, డాక్టర్ కె. ఎన్. బృందా 'వసంతలక్ష్మికి స్వాగతం' అనే పాటను బహు శ్రావ్యంగా పాడి వినిపించారు. అరవా జైపాల్ 'కలమా' అనే కవితను, ముగ్ధ మాదవి 'శుభ ఉగాది - శాంతి ఉగాది' కవితను, నెల్లూరి ఇందిర 'శిశిర పర్వం' అనే కవితను వసంతమాసంపై, యువ కవయిత్రి ఆనం ఆశ్రితారెడ్డి 'వెలిగే దీపం' అనే కవితను, మల్కని విజయలక్ష్మి 'తెలుగు ఉగాది' కవితను, తటపర్తి వెంకటేశ్వర్లు 'తెలుగు వెలుగు కిరణం' అనే కవితను చదివి వినిపించారు. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ 'ఉగాది వచ్చింది ' అనే కవితను  వచ్చింది, తెచ్చింది, నచ్చింది, మెచ్చింది, పిలిచింది, గెలిచింది అనే లయతో ఉద్వేగంగా చదివి అందరినీ ఆకట్టుకున్నారు.


డాక్టర్ గీతా మాధవి కవిసమ్మేళనం అధ్యక్షులు మధు ప్రఖ్యాకు, ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాదుకు మరియు సమ్మేళనంలో పాల్గొన్న కవులకు కవయిత్రులకు ధన్యవాదాలు మరియు మరోమారు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సభను ముగించారు. చక్కని సమావేశం నిర్వహించినందుకు కవులు వీక్షణం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, వీక్షణం భారతీయ ప్రతినిధి.



Comments

Popular posts from this blog