Posts

Image
 నారదులున్నారు జాగ్రత్త! నారదలున్నారు జాగ్రత్త తగాదాలుపెడతారు జాగ్రత్త పైకి స్వామిభక్తి  చాటుతారు కానీలోన గోతులుతీసి పడదోయచూస్తారు ఇక్కడ మాటలు అక్కడ చెబుతారు అక్కడ మాటలు ఇక్కడ చెబుతారు పుకార్లు పుట్టిస్తారు జాగ్రత్త విద్వేషాలు రేపుతారు జాగ్రత్త అసూయతో  రగిలిపోతుంటారు ఈర్ష్యతో కుమిలిపోతుంటారు కొట్టుకుంటుంటే కుతూహలపడతారు తిట్టుకుంటుంటే తృప్తినిపొందుతారు చాడీలు మోస్తారు చేతులు కలుపుతారు లాభాలు పొందుతారు స్వార్ధపరులు అవుతారు కక్కుర్తి పడతారు కాటువేయ చూస్తారు కుటుంబాలను కూల్చుతారు స్నేహితులను విడదీస్తారు ప్రేమికులమధ్య చిచ్చురేపుతారు పోటీదారులమధ్య పెట్రోలుపోస్తారు నిప్పును రగిలిస్తారు మంటలు లేపుతారు బూటకాలు చేస్తారు నాటకాలు ఆడతారు తప్పక నారదలు బొక్కబోర్లాపడతారు బాధితుల చేతులకుచిక్కి తన్నులుతింటారు నారదులను గమనించండి నాటకాలకు తావివ్వకండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సాహితీసంద్రం అలల్లా ఆలోచనలు ఆవిర్భవిస్తున్నాయి బడబాగ్నిలా భావాలు భగభగలాడుతున్నాయి చినుకుల్లా అక్షరాలు కురుస్తున్నాయి పైరగాలిలా పదాలు ప్రసరించుతున్నాయి పాలుచిలికినట్లుగా మనోమదనము సాగుతుంది వెన్నలా కవిత్వము పుట్టకొస్తుంది జలచరాల్లా కవులు ఈదుతున్నారు రత్నాల్లా కవితలను వెలువరించుతున్నారు సముద్రాన్నిచూచి సాహిత్యాన్నిచదివి సంతసపడండి కవులవ్రాతలుపఠించి కవనలోతులుపరికించి కుతూహలపడండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అడుగో ఆధునికకవి! అవిగో అతనిభావాలు! కవికోకిల అవుదామనుకుంటున్నాడోయ్ గాంధర్వగానమును ఆలపించాలనుకుంటున్నాడోయ్ గొంతును సవరించాలనుకుంటున్నాడోయ్ నోరును తెరవాలనుకుంటున్నాడోయ్ పెదవులను విప్పాలనుకుంటున్నాడోయ్ తియ్యదనాలను చల్లాలనుకుంటున్నాడోయ్ వీనులకు విందునివ్వాలనుకుంటున్నాడోయ్ ప్రేక్షకులను ప్రమోదపరచాలనుకుంటున్నాడోయ్ ఆనందమును అందించాలనుకుంటున్నాడోయ్ అంతరంగాలను ఆకర్షించాలనుకుంటున్నాడోయ్ ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నాడోయ్ చప్పట్లు కొట్టించాలనుకుంటున్నాడోయ్ శ్రావ్యత చేకుర్చాలనుకుంటున్నాడోయ్ నవ్యత తెలియజేయాలనుకుంటున్నాడోయ్ కైతలను గానంచేయాలనుకుంటున్నాడోయ్ శ్రోతలను కట్టిపడవేయాలనుకుంటున్నాడోయ్ నవ్వులు చిందాలనుకుంటున్నాడోయ్ మోములు వెలిగించాలనుకుంటున్నాడోయ్ అమృతజల్లులలో తడపాలనుకుంటున్నాడోయ్ ఆనందడోలికలలో ముంచాలనుకుంటున్నాడోయ్ గుండెతో శ్రుతినికలపాలనుకుంటున్నాడోయ్ జీవనగానంతో ప్రీతినిపంచాలనుకుంటున్నాడోయ్ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అందాకా ఏగేదెట్లాగా! ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉండమంటాడు ఆప్పుడే వెళ్ళటానికి అంతతొందర ఏమంటాడు వెళ్ళకుండా అడ్డుకుంటాడు పొనీకుండా పట్టుకుంటాడు చెంతనే ఉండమంటాడు కబుర్లను చెప్పమంటాడు సరసాలు ఆడుకుందామంటాడు సల్లాపాలు కొనసాగిద్దామంటాడు చిరునవ్వులు చిందమంటాడు మరుమల్లెలు చల్లమంటాడు ముచ్చట్లు చెప్పమంటాడు మురిపాలు చెయ్యమంటాడు చక్కదనాలు చూపమంటాడు ఆనందాలు అందించమంటాడు వెన్నెలలో విహరిద్దామంటాడు పూలతోటలో పచారీచేద్దామంటాడు పెళ్ళయ్యేదాకా ఏగేదెట్లాగా ఆపేదెట్ల్లాగా ఆగేదెట్ల్లగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తిష్ఠవేసినకవిత అందం పిలుస్తుంది ఆనందం ఇస్తానంటుంది సుమాలను చూపిస్తానంటుంది పరిమళాలను చల్లుతానంటుంది జాబిలిని కనమంటుంది వెన్నెలని ఆస్వాదించమంటుంది ఆకాశానికి ఎగరమంటుంది మబ్బులనెక్కి స్వారీచేయమంటుంది తారలతో ఆడమంటుంది తళతళలతో మెరిసిపొమ్మంటుంది సముద్రం స్వాగతిస్తుంది అలలపై తేలమంటుంది కవిత కవ్విస్తుంది కలము పట్టిస్తుంది ఊహలు ఊరిస్తుంది పదాలు పారిస్తుంది కాగితం నింపించింది కవిత్వం పుట్టించింది వర్ధమానకవిని విస్తుపరచింది అందాలకైతని ఆవిష్కరింపజేసింది పాఠకులను చదివించింది పరవశాలను చేకూర్చింది మనసులలో మాటేసింది తలలలో తిష్ఠవేసింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కలాలు కదిలితేనే! కవివర్యుల పాటలు గాయకుల గానాలు నర్తకీమణుల నృత్యాలు నేపథ్య వాయిద్యాలు వీక్షకులవినోదాలు స్పందనలు కలాలు కదిలితేనే వినబడతాయి అతివల అందచందాలు మన్మధుని మోహాలు విరహ వేదనలు హృదయ స్పందనలు మదులకు  మురిపాలు కలాలు కదిలితేనే కనబడతాయి పండితుల ప్రవచనాలు భక్తుల గుమిగూడటాలు ఔత్సాహికుల ఉరుకులు సంప్రదాయ ఆచరణలు  సంస్కృతి పరిరక్షణలు కలాలు కదిలితేనే సంభవిస్తాయి కవుల సమ్మేళనాలు సన్మాన సత్కారాలు శాలువాలు కప్పటాలు బిరుదుల ప్రదానాలు పత్రికలలో ప్రచారాలు కలాలు కదిలితేనే జరుగుతాయి అందాల వర్ణనలు ఆనందాల చేరవేతలు మనసుల మురిపింపులు నవ్వుల కురిపింపులు మోముల వెలిగింపులు కలాలు కదిలితేనే కొనసాగుతాయి అక్షరాల అల్లికలు పదాల ప్రయోగాలు పంక్తుల పసందులు చరణాల కూర్పులు భావాల విస్ఫోటనాలు కలాలు కదిలితేనే సృష్టించబడుతాయి అవినీతిపై పోరాటాలు అక్రమాలపై దండెత్తటాలు అన్యాయాలపై ఎదిరింపులు ఆర్తనాదులకు సాయాలు సంఘసంస్కరణల సాధించటాలు కలాలు కదిలితేనే సాధ్యమవుతాయి పద్యాల పరుగులు వచనకైతల వరదలు ప్రబోధాల పరంపరలు ప్రణయాల ప్రకంపనలు పాఠకుల పారవశ్యాలు కలాలు కదిలితేనే బయటకొస్తాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ప్రేమసందేశం ప్రేమను పెట్టెలోపదిలపరచి కాపాడుకుంటున్నా ప్రేమను పొట్లంలోకట్టి భద్రపరచుకుంటున్నా ప్రేమను పువ్వుల్లోపెట్టి పరిరక్షించుకుంటున్నా ప్రేమను మనసులోదాచుకొని మననంచేసుకుంటున్నా ప్రేమను గుండెలోమరుగుపరచుకొని గురుతుకుతెచ్చుకుంటున్నా ప్రేమను హృదిలోపొందుపరచుకొని యాదిచేసుకుంటున్నా ప్రేమను మరచిపోలేక మాటిమాటికితలచుకుంటున్నా ప్రేమను మాటల్లోచెప్పలేక మౌనందాలుస్తున్నా ప్రేమను పువ్వులిచ్చితెలుపలేక పరెశానవుతున్నా ప్రేమను లేఖలోకెక్కించినా పంపలేకున్నా అయితే ప్రేమను కవితగామలచి బహర్గితంచేస్తున్నా ప్రేమ ప్రేయసికిచేరుతుందని ఆశపడుతున్నా ప్రేమకు ప్రతిస్పందిస్తుందని ప్రతీక్షిస్తున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం