నవ్వులలోకం నవ్వు నవ్వితే నవరత్నాలు రాలవులే నవ్వు నవ్వితే నాపచేను పండునులే నవ్వు నవ్వులనదిలో పువ్వులపడవెక్కి పయనించి పరమానందము పొందుములే నవ్వు నాలుగందాల చేటని నువ్వు నమ్మకులే చిట్టిపాప నవ్వితే పరవశం కలుగునులే పడుచుపిల్ల నవ్వితే అందము రెట్టింపయి ఆనందము కలుగునులే దయచేసి నువ్వు నవ్వు నలుగురిని నవ్వించు నవ్వు నవ్వకపోతే నువ్వు నీరసించిపోతావు నవ్వులలోకంలో విహరించు నిత్యానందాన్ని అనుభవించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Posts
Showing posts from August, 2022
- Get link
- X
- Other Apps
సరస్వతీదేవిని స్వాగతిస్తా అక్షర దీపాలను వెలిగిస్తా అఙ్ఞాన అంధకారాన్ని తరిమేస్తా తేనెలూరు పదాలను పేరుస్తా అద్భుత అర్ధాలను తెలియజేస్తా ప్రాసలను సొంపుగా వాడేస్తా చెవులకు ఇంపును కలిగిస్తా పాటలను తీపిగా పాడేస్తా మనసులను ముచ్చట పరిచేస్తా కవితలను నదిలా పారిస్తా పద్యాలను అందంగా అల్లేస్తా గేయాలను గమ్మత్తుగా వ్రాసేస్తా సాహిత్య పంటలను పండిస్తా ఆలోచనలను మదిలో పుట్టిస్తా తిన్నగా కవ్వంతో చిలికేస్తా భావాలను వెన్నలా తేలాడిస్తా చదువరులకు చక్కగా అందిస్తా ప్రకృతి అందాలను వర్ణిస్తా పాఠకులకు ఆనందాలను పంచేస్తా మనసులను ముచ్చట పరుస్తా సాహితీలోకాన శాశ్వతంగా నిలిచిపోతా సరస్వతిని స్వాగతిస్తా సాహిత్యాన్ని సృష్టిస్తా కవనం కొనసాగిస్తా కవితలను కనేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఓ సఖీ! నీ చంద్రవదనం చూడాలని నిన్ను చిరునవ్వులు చిందమంటే నువ్వు ఏడుపుముఖం పెడితే నేను ఏలా తృప్తిపడేది సఖీ? నీతో కాలం గడపాలని నిన్ను దగ్గరకు రమ్మంటే నువ్వు దూరంగా జరిగితే నేను ఏలా కోరికతీర్చుకునేది చెలీ? నీతో సరదాగ ఉండాలని నిన్ను కబుర్లు చెప్పమంటే నువ్వు మూతిబిగించి మౌనందాలిస్తే నేనెలా భరించేది ప్రియా? నిన్ను అందంగా చూడాలని నీకు మల్లెమాలను అందిస్తే నువ్వు కొప్పులో పెట్టుకోకపోతే నేను ఏలా తట్టుకోగలను సఖియా? నిన్ను ఆనందపరచాలని నీకు పట్టుచీరను కొనిస్తే నువ్వు కట్టుకోనని మొండికేస్తే నిన్ను ఏలా అర్ధంచేసుకోవాలి చెలియా? నీపై చక్కని కవితనువ్రాసి నీకు వినిపించాలని చదువుతుంటే నువ్వు కళ్ళుచెవ్వులు మూసుకుంటే నేను ఏలా కవనంసాగించాలి ప్రియురాలా? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఓపువ్వు కబుర్లు ఓపొద్దు పొడిచింది ఓపువ్వు పూచింది నాకంట పడింది నామనసు మురిసింది ఆపువ్వు పిలిచింది ఓనవ్వు నవ్వింది ఊసులును చెప్పింది ఉత్సాహము నిచ్చింది మధ్యహ్నమయ్యింది పువ్వువిచ్చుకుంది పరువాలుచూపింది ముచ్చటాపరచింది పొంకమూ చూపింది పరవశము నిచ్చింది రంగునూ చూపింది రంజింప జేసింది పరిమళం చల్లింది తేనెచుక్కలు విసిరింది నోటిని తీపిజేసింది మనసును దోచింది సాయంత్రమయ్యింది ఒరిగిపోయింది వాడిపోయింది నేలరాలింది నాకు బాధకలిగింది రాలినా బుజ్జగించింది ఒకరాత్రికి ఆగమంది రేపు మరలావస్తానంది కవిత పుట్టకొచ్చింది కాగితంపైకి ఎక్కింది పలువురికి చేరింది మనసులను తట్టింది పూలు ప్రేమకుప్రతీకలు పూవులు సున్నితమనస్కులు ప్రకృతికి ప్రతిబింబాలు పరికించువారికి ప్రియనేస్తాలు పూలమొక్కలను పెంచుదాము పూలసహవాసమును చేద్దాము పూలకు స్వాగతం పలుకుదాం పూలకు జైజైలు చెబుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం జానకి పూలకవితవ్రాసింది సాహితి చదివిమెచ్చుకుంది పద్మజమది పులకరించింది సరోజినిచూచి సంతసపడింది
- Get link
- X
- Other Apps
చాలవా! దేహధారులకు కంటికి అందము వంటికి ఆరోగ్యము మనసుకు ఆనందము చాలవా! సుఖజీవనానికి ఉండటానికి కుటీరము పరుండటానికి మంచము అనుకూలమైన పరిసరము చాలవా! సమాజములో నిలబడటానికి తోడుకు సత్కళత్రము వంశోద్ధరణకు సత్సంతానము సలహాసంప్రదింపులకు ఒకనేస్తము చాలరా! బ్రతకటానికి తినటానికి ఆహారము త్రాగటానికి జలము గుండెనాడించుటకు అనిలము చాలవా! సంసారసాగరాన్ని ఈదుటకు సంపాదనకు చిరుఉద్యోగము అవసరాలకు సరిపడుఅదాయము చేరటానికి జీవితలక్ష్యము చాలవా! కవనానికి మనసున భావము చేతిన కలము వ్రాయుటకు కాగితము చాలవా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
శృతిమించినరాగం అరుణోదయం అయ్యింది పుడమి పులకరించింది పూలు వికసించాయి ప్రకృతి పరవశించింది అందం తొంగిచూచింది ఆనందం వెల్లివిరిసింది హృదయం పొంగిపోయింది అంతరంగం వలలోపడింది రాగం శృతిమించింది ప్రేమ హద్దులుదాటింది వయసు తొందరచేసింది మనసు మాయలోపడింది కోర్కె వెంటబడింది తపన ఎక్కువయ్యింది తరుణి తటస్థించింది తనువు తృప్తిపడింది జత కుదిరింది జంటను చేసింది ఝుంకారం వినిపించింది జగతి మురిసింది దేవుడు కరుణించాడు ముత్యాలజల్లు కురిపించాడు దీవెనెలు అందించాడు మనసులు మురిపించాడు శృతి కలిసింది స్మృతిలో నిలిచింది శ్రావ్యత కలిగింది శ్రవణానందం అయ్యింది ప్రేమ ఫలించింది కధ సుఖాంతమయ్యింది కవిత పుట్టకొచ్చింది కమ్మదనాన్ని ఆస్వాదించమంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నాచెలి కబుర్లు నా చెలికి సొగసు ఎక్కువ పొగరు తక్కువ నా సఖికి మాటలు తక్కువ మధురం ఎక్కువ నా ప్రేయసికి షోకులు ఎక్కువ సరసాలు తక్కువ నా ప్రియురాలుకు కోర్కెలు ఎక్కువ ఓపిక తక్కువ నా చెలియకు ఆశలు ఎక్కువ శక్తి తక్కువ నా నెచ్చెలికి ఆకలి ఎక్కువ తినేది తక్కువ నా సకియకు చదువు ఎక్కువ జీతం తక్కువ నా జవరాలుకు తొందర ఎక్కువ చేసేది తక్కువ నా ప్రేమికురాలుకు కలికితనం ఎక్కువ చిలిపితనం తక్కువ నా ప్రియకు తపన ఎక్కువ తృప్తి తక్కువ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
రంగేళీ వెలుగులోని తెలుపునై చీకటిలోని నలుపునై చీకటివెలుగుల రంగేళీనై ప్రభవిస్తా ఆకులలో పచ్చదనాన్నై పువ్వులలో రంగునై మొక్కలలో ప్రాణాన్నై ముచ్చటపరుస్తా ఆకాశంలో నీలిరంగునై హరివిల్లులో సప్తవార్ణాలనై కళ్ళల్లో కాంతినై కళకళలాడుతా పాటలలో పల్లవినై మాటలలో తేనియనై ఆటలలో ప్రతిభనై అలరిస్తా పాడుతా కోకిలనై నాట్యంచేస్తా నెమలినై నడకలునేర్పుతా హంసనై రంజింపజేస్తా రసికుడనై మురిపిస్తా వధువునై తూలిస్తా మధువునై మురిపిస్తా ముగ్ధనై ముచ్చటపరుస్తా ముద్దునై మనసులో తలపునై చేతిలో కలమునై పదాలతో కవితనై చదివిస్తా సంతసపరుస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు) మనకు గర్వకారాణం మన సినారే మనతెలుగుబాషకు ఒకవరం మన సినారే తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది అని చాటిచెప్పినవాడు మన సినారే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అంటు సినీపాటలరచయతగా ప్రవేశము చేసినవాడు మన సినారే పెక్కు పుస్తకాలు కమ్మని కవితలు వ్రాసినవాడు మన సినారే పలు బిరుదులు సత్కారాలు పొందినవాడు మన సినారే తెలుగు బాషకు పేరు ప్రఖ్యాతులు తెచ్చినవాడు మన సినారే తెలుగునాట యువకవులను ప్రోత్సహించినవాడు మన సినారే తెలుగులో గజల్లు వ్రాసి ఘనకీర్తిని సాధించినవాడు మన సినారే తెలుగు సాహిత్యంలో శాశ్వతస్థానం సంపాదించినవాడు మన సినారే ఙ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినవాడు మన సినారే పద్మభూషణ్ బిరుదునుపొంది సత్కరించబడినవాడు మన సినారే విశ్వంభర కావ్యాన్ని వ్రాసి విశిష్ట పేరును పొందినవాడు మన సినారే కర్పూర వసంతరాయలు గేయకావ్యాన్ని వ్రాసి కడుఖ్యాతిని పొందినవాడు మన సినారే సినారే ఘటికుడు సినారే అమరుడు సినారే సరస్వతీపుత్రుడు సినారే సాహితీసేవకుడు సినారేను నేడు స్మరించుకుందాం సినారేకు నేడు శ్రద్ధాంజలి ఘటిద్దాం సినారే ఘనారే సినారే భళారే గుండ్లపల్లి రాజే...
- Get link
- X
- Other Apps
నేను నాఅలోచనలు అందాలు అలరిస్తే ఆనందపడతా అందరిని ఆహ్లాదపరుస్తా పువ్వులు పరిమళాలు చల్లితే ఆఘ్రానిస్తా అందరికి అందిస్తా నవ్వులు వెలుగులు చిమ్మితే ప్రకాశించిపోతా ప్రక్కనున్నవారిని పరవశింపజేస్తా చెలి చెంతకొస్తే సరసాలాడతా ప్రణయకవితను వ్రాస్తా పలుకులు తేనెలు చిందితే ఆస్వాదిస్తా అందరికి పంచుతా అక్షరపుష్పాలు అందుబాటులోకొస్తే అల్లుతా మాలగా అమ్మసరస్వతి మెడలోవేస్తా పదాలప్రాసలు పొసిగితే ప్రయోగిస్తా పలువురిని పులకరింపజేస్తా కవిత కవ్విస్తే కలంపడతా కాగితాలు నింపేస్తా కవిగా కనిపించకుండా వినిపిస్తా వినోదపరుస్తా మనసులను ముట్టేస్తా శాశ్వతస్థావరాన్ని సంపాదించుకుంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
సరస్వతీ నమస్తుభ్యం (ఙ్ఞానోదయమయినవేళ) విఘ్నేశ్వరుని వేడుకొని కలాన్ని పట్టా కానీ కదలలా అంజనేయుని అర్ధించా అ ఆలు అందుబాటులోకి రాలా మురళీకృష్ణునికి మొక్కా మనసు కలమును ముందుకు నడపలా సాయిబాబాను శ్లాఘించా చేతిలోనికలం సాగలా అయ్యప్పకు శరణంచెప్పా అక్షరాలు స్ఫురించలా వెంకటేశ్వరునికి విన్నవించుకున్నా విషయాలేమి ఉరకలా శివుని ధ్యానించా సాహితి కరుణించలా విరించికి విన్నపంచేసుకున్నా ప్రయోజనం కనిపించలా పార్వతిదేవిని ప్రార్ధించా పదాలు పారలా లక్ష్మిదేవిని తలచుకున్నా లక్ష్యం సిద్ధించలా అప్పుడు అర్ధమయ్యింది బుద్ధొచ్చింది ఊహతట్టింది వాగ్దేవిని వేడుకున్నా వెంటనే వెలుగొచ్చింది అంధకారం అంతమయ్యింది భావాలు బయటకొచ్చాయి ఆలోచనలు అంతరంగాన్నిముట్టాయి అక్షరదీపాలు ఆవరించాయి పదాలు పొంగిపొర్లాయి విషయాలు వెంటబడ్డాయి కలం దౌడుతీసింది కాగితాలు నిండిపోయాయి కవితలజల్లు కురిసింది సాహితీవరద సాగింది పద్యాలు పుట్టకొచ్చాయి పాటలు పరుగులెత్తాయి వాగ్దేవికి వేలవేల వందనాలు సాహితికి స్వాగత సుస్వాగతాలు ఙ్ఞానోదయం అయ్యింది సరస్వతీకటాక్షం దొరికింది కవితలను పారిస్తా కమ్మదనాన్ని అందిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
అందచందాలు చూడాలని నాకున్నది (గజలు) అందాలను కంటినిండ చూడాలని నాకున్నది ఆనందము మనసునిండ నింపాలని నాకున్నది తెల్లవారు సమయమందు పెందలకడ నిదురలేచి అరుణకిరణముల తూర్పున చూడాలని నాకున్నది నీలిగగనమందు మేఘములమధ్యన తిరుగుతున్న చందమామ సొగసులన్ని చూడాలని నాకున్నది సాయంసంధ్యావేళన ఒంటరిగా తోటకెళ్ళి విరులచూచి సంతసపడి పోవాలని నాకున్నది ఎత్తుకు ఎగిసిపడుతున్న అలసిపోని అలలచూచి కడలితీరమందు కులుకులాడాలని నాకున్నది చిలిపినవ్వులు చిందేటి ప్రియురాలును పిలుచుకోని చిరుమోమును పదేపదే చూడాలని నాకున్నది కలముపట్టి కవిరాజుగ కమ్మనయిన కవితనల్లి కర్ణములకు ఇంపునివ్వ పాడాలని నాకున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఓహో గులాబిబాల! (గులాబి కబుర్లు) గులాబి ఆహ్వానిస్తున్నది అలోచనలురేపుతున్నది గులాబిపువ్వు ఉత్సహపరుస్తున్నది ఊసులుచెప్పమంటున్నది గులాబిపూవు మెరుస్తున్నది మురిపిసున్నది గులాబిపుష్పం విచ్చుకున్నది వినోదపరుస్తున్నది గులాబికుసుమం చేతిలోకి తీసుకోమంటున్నది చెలికొప్పులో తురుమమంటున్నది గులాబిరంగు కళ్ళని కట్టేస్తున్నది కమ్మదనాన్ని చూపిస్తున్నది గులాబిరేకులు అందాలను వెదజల్లుతున్నాయి ఆనందాన్ని కలిగిస్తున్నాయి గులాబికన్యక అత్తరు చల్లుచున్నది మత్తులో పడవేస్తున్నది గులబిబాల గుబులు పుట్టిస్తున్నది గుండెకు గాయంచేస్తున్నది గులాబికన్నియ గుండెకు హత్తుకున్నది చెంతకు రమ్మంటున్నది గులాబిరాణి రాలేదని గుర్రుగుర్రుమంటున్నది రాకపోతే ముల్లుగుచ్చుతానంటున్నది గులాబికన్య కలం పట్టమంటున్నది కవిత వ్రాయమంటున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఓ కవీ! పాటకు నువ్వే మూలం ప్రాసకు పడ్డావు కష్టం పోశావు అక్షరాలకు ప్రాణం పంచేవు చెవులకు శ్రావ్యం వచనకవితకు నువ్వు మూలం చేశావు అద్భుత పదప్రయోగం పుట్టించేవు ఉన్నత భావం తెలిపేవు చక్కని విషయం పద్యానికి నువు మూలం నీయతిప్రాసలు అద్భుతం గణాల కూర్పు బహుఘనం చేశావు కవనం చందోబద్ధం చేశావు అక్షరాల సేద్యం వాడేవు హలంలా నీకలం చేసేవు సాహితిని సస్యశ్యామలం సాధించేవు కవితాపంటల ఫలసాయం చేసేవు సాహిత్యలోకాన్ని సుభిక్షం నిలిచేవు జనులమదులలో కలకాలం తొలగించేవు ప్రజల అఙ్ఞానాంధకారం ఇచ్చేవు పాఠకులకు శాశ్వతానందం కవులకు నీరాజనం కవితలకు ఆహ్వానం కలాలకు ధన్యవాదం కవనానికి పట్టాభిషేకం కవితలను వల్లెవేస్తాం కవులను తలచుకుంటాం సాహితిని గౌరవిస్తాం సరస్వతికి పూజలుచేస్తాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం