తెలుగు వెలుగుతుంది
తెలుగోళ్ళకు
తెలివొచ్చింది
తెలుగుబాషకు
వెలుగొచ్చింది
తెలుగులో కవులు
రోజూ పుట్టుకొస్తున్నారు
తెలుగు ప్రక్రియలను
బాగా ప్రచారంలోకితెస్తున్నారు
తెలుగు కవితలు
తెగవస్తున్నాయి
తియ్యందనాలు
తినిపిస్తున్నాయి
తెలుగు పాఠకులు
చదువుచున్నారు
ప్రోత్సహిస్తున్నారు
తృప్తినిపొందుచున్నారు
తెలుగుబాష
తీరుతెన్నులు
మురిపిస్తున్నాయి
మనసులతడుతున్నాయి
తెలుగు కవిసమ్మేళనాలు
వివిధ సాహిత్యకార్యక్రమాలు
పలుచోట్ల జరుగుతున్నాయి
విశేషఆదరణను పొందుతున్నాయి
తెలుగుకు
మంచిరోజులొచ్చాయి
తెలుగువారికి
సంతృప్తినిస్తున్నాయి
తెలుగు తల్లికి
జైజైలు కొడదాం
తెలుగు బాషను
విశ్వవ్యాప్తంచేద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment