ప్రశ్నిస్తా! సమాజంలో సాగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తా బెదరింపులతో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తా ఆస్తులు త్వరగా కూడగట్టుకోవాలనే తపనతో దొడ్డిదారులు పడుతున్న అవినీతిపరులను ప్రశ్నిస్తా అవకాశాల కోసం కాచుకకూర్చొని అవి దొరికినప్పుడు సమయం చూసి దోచుకొను దోపిడిదారులను ప్రశ్నిస్తా అజ్ఞాన తిమిరంలో అలమటిస్తూ కాలంగడుపుతూ తెలిసీ తెలియక ప్రవర్తిస్తున్న మూర్ఖులను ప్రశ్నిస్తా పలుకుబడితో అహంకారంతో అధికారుల అండతో బడుగులను తొక్కేస్తున్న పెత్తందారులను ప్రశ్నిస్తా స్వప్రయోజనం కోసం స్వకుటుంబ సంతోషం కోసం అపకారాలకు ఒడిగడుతున్న దుర్మార్గులను ప్రశ్నిస్తా దుష్టబుద్ధితో నయవంచనలతో జనులను మాయచేసి మాటలతో మభ్యపెడుతున్న మోసగాళ్లను ప్రశ్నిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.