నేడే ఎన్ టీ ఆర్ జయంతి
రామారావును
స్మరిద్దాం
విశిష్టతలను
నెమరేద్దాం
రామారావు
నిమ్మకూరులో పుట్టాడు
రాముడిగా
సార్ధకనాముడయ్యాడు
చిత్రసీమలో
వెలిగాడు
రాజకీయాలలో
మెరిసాడు
అందరికీ
అన్న అయ్యాడు
అందరి
మదులలో నిలిచాడు
రాముడంటే
రామారావే అన్నారు
కృష్ణుడంటే
రామారావే అయ్యాడు
రాయలసీమలో కరువస్తే
జోలెపట్టాడు
విరాళాలు సేకరించి
బాధితులను ఆదుకున్నాడు
కేంద్రప్రభుత్వం
పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది
ఆంధ్ర విశ్వవిద్యాలయం
గౌరవడాక్టరేట్ కళాప్రపూర్ణలతో సత్కరించింది
రెండురూపాయలకే కిలోబియ్యంపధకం
అమలుచేశాడు
ఆడువారికి ఆస్తిలోసమానహక్కును
కల్పించాడు
పటేల్ పట్వారి వ్యవస్థను
రద్దుచేశాడు
వెనుకబడిన వర్గాలకు రిజర్వేషను
సౌకర్యమిచ్చాడు
తెలుగుదేశం పార్టీని
పెట్టాడు
తొమ్మిదినెలలలోనే అధికారంలోకి
తెచ్చాడు
ప్రతిపక్షాలను
ఏకంచేశాదు
కాంగ్రెసుపార్టీని
మట్టికరిపించాడు
పార్లమేంటులో తెలుగుదేశమును
ముఖ్యప్రతిపక్షం చేశాడు
తెలుగుగళాన్ని దేశమునకు
వినిపించేలా చేశాడు
తెలుగు భాషకు
తెలుగు జాతికి
దేశవిదేశాలలో
గుర్తింపుతెచ్చాడు
రామారావు
నటనలో అద్వితీయుడు
రామారావు
రాజకీయాలలో విశిష్టుడు
రామారావుకు
జైకొడదాం
తెలుగుజాతిని
గౌరవిద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అందరికీ నందమూరి తారకరామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు
Comments
Post a Comment