పుర్రెకోబుద్ధి


బుర్రకోబుద్ధి

భూలోకమందున


పుర్రెకోపద్ధతి

పుడమినందున


పుచ్చెకోపిచ్చి

భూగోళమందున


తలకోతలపు

ధరణినందున


శిరస్సుకోచాపల్యము

జగమునందున


నెత్తికోనడక

విశ్వమందున


మస్తకానికోదారి

మహినందున


సిరముకోప్రత్యేకత

సారంగమందున


మూర్ధానికోప్రీతి

మేదినందున


ఔదలకో ఔపోసన

అవనినందున


మస్తముకో అందము

జగతినందున


మనిషికోవిశిష్టత

వసుధనందున


మనుజులచూచి

మసలుకోవోయి


మంచినిగమనించి

నడుచుకోవోయి


ఎదుటివారినితెలుసుకొని

ప్రవర్తించవోయి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog