స్వరఝరులు
(పాటలు)
అక్షరాలు
స్వరాలు
పదపంక్తులు
గానసుధలు
అర్ధాలు
అద్భుతాలు
భావాలు
సమ్మోహనాలు
పల్లవీలు
ప్రాణాలు
చరణాలు
సరాగాలు
ఊహలు
ప్రవాహాలు
మదులు
జలపాతాలు
గాయకులు
గంధర్వులు
గళాలు
దైవవరాలు
పెదాలు
తీపితావులు
చెవులు
శ్రావ్యతాగ్రహణాలు
లయలు
హొయలు
సృతులు
విందులు
వాయిద్యాలు
వినోదభరితాలు
పాటలు
శ్రోతలకుపసందులు
మాత్రలు
సొంపులు
ప్రాసలు
ఇంపులు
గురువులు
దీర్ఘాలాపనలు
లఘువులు
మందగమనాలు
ఆలకింపులు
అదృష్టాలు
పులకింపులు
ప్రతిఫలాలు
సరాగాలలో
పాల్గొందామా
సంతసాలలో
తేలిపోదామా
గుండ్లపల్లి రాజేంద్రపసాద్,భాగ్యనగరం
Comments
Post a Comment