తెలుగుదారులు


తెలుగుదారి

పట్టరా

వెలుగులు

వెదజల్లరా


తెలుగుబాట

నడవరా

కుసుమాలు

పరచరా


తెలుగుత్రోవ

అనుసరించరా

తేనెచుక్కలు

చల్లరా


తెలుగుపథము

నిర్మించరా

సౌరభాలు

వెదజల్లరా


తెలుగుతెరువు

చూపరా

తెలివితేటలు

అందించరా


తెలుగుమార్గము

సుందరముచేయరా

తోటివారలకు

సంతసమునివ్వరా


తెలుగురాస్తా

చూపించరా

తేటదనాలు

తెలుపరా


తెలుగుదోవ

సరిచేయరా

కదాలు

త్రొక్కించరా


తెలుగుజాడ

వెలిగించరా

వెన్నెలందు

విహరింపజేయరా


తెలుగుతొవ్వ

పయనించమనరా

తెలుగుతల్లిఋణము

తీర్చుకోమనరా


గుండపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog