ఉగాది ఆహ్వానం


ఉగాది పండుగ వచ్చింది —

కొత్త ఉదయ కాంతులను తీసుకొచ్చింది,

పచ్చని ఆశల పల్లవిలా

ప్రతి గుండెలో వెలుగులు నింపింది.


ఉగాది కొత్తవత్సరాన్ని తెచ్చింది —

కాలచక్రం కొత్త కథలు చెప్పింది,

చిగురించే కలలతో

జీవితానికి కొత్త రాగం అందించింది.


ఉగాది ఉత్సాహము నచ్చింది —

మనసుకు మధురిమగా తాకింది,

మల్లె పూలలా, వసంతపు పరిమళంలా 

ప్రతి ఊపిరిలో ఆనందం నింపింది.


ఉగాది ప్రకృతిని మెచ్చింది —

మన సంస్కృతిని మళ్లీ పలికించింది,

పచ్చడి రుచుల్లో కోక్యిల కూతల్లో

జీవిత సత్యాలను నేర్పించింది.


ఉగాది గుడులలోకి పిలిచింది —

మామిడి తోరణాలు కట్టించింది,

ముందుకు సాగమని ఆహ్వానించింది,

గతాన్ని గాలిలో కలిపి భవిష్యత్తు వైపు నడవమంది.


ఉగాది మనసులను గెలిచింది —

నిరాశలపై ఆశల జెండా ఎగరేసింది,

కొత్త సంవత్సరాన్ని నవ్వులతో

మన గుండెలను నింపింది.


ఉగాది అంటే —

ప్రతి ముగింపులో ఒక ప్రారంభం,

ప్రతి కన్నీటిలో ఒక చిరునవ్వు,

ప్రతి హృదయంలో ఒక కొత్త జీవితం.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog