కవితామృతం


కవితలు కవిని కోరితే —

మౌనం మధుర స్వరమవుతుంది,

కవితలు కలలోకొస్తే —

నిద్రే నినాదమవుతుంది.


కవితలు కనికరిస్తే —

మనసు మడతల్లో మమతగా మెలుగుతుంది,

కవితలు కుమ్మరిస్తే —

భావ భాండాగారం పొంగిపొర్లుతుంది.


కవితలు కలం నుంచి జారితే —

హృదయం గంగలా పారుతుంది,

కవితలు కాగితాలకెక్కితే —

పదాలు ప్రపంచాన్ని చుట్టేస్తాయి.


కవితలు కురిపిస్తే —

ఎండిన మనసులు చిగురిస్తాయి,

కవితలు కారిస్తే —

వేదనలు వెన్నెలగా మారుతాయి.


కవితలు కనబరిస్తే —

కళ్లను మాయచేసి కట్టిపడేస్తాయి,

కవితలు కట్టేస్తే —

మనసులను మంత్రముగ్ధం చేస్తాయి.


కవితలు — కల్పవృక్షాలు, కాంతులు,

కాలానికి దీపాలు, మధుర మంత్రాలు —

కవితలు ఉంటే — జీవితం జడత్వం కాదు,

భావం బంధీ కాదు, అక్షరమవుతుంది అజరామరము.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog